Site icon HashtagU Telugu

Crime News: ఏపీలో దారుణం.. టమోటా రైతును హత్య చేసిన దుండగులు

Crime News

New Web Story Copy 2023 07 13t140343.549

Crime News: ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఓ రైతు గొంతు కోసి హత్య చేశారు దుండగులు. రైతు వద్ద 30 లక్షల రూపాయలు ఉన్నట్లు అనుమానించిన దుండగులు రాత్రి రైతు ఇంటికి వెళ్లి హత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసును ఛేదించేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కేశప్ప తెలిపారు.

దేశంలో టమోటా ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం సామాన్యులు టమోటా కొనే పరిస్థితుల్లో లేరు. ఈ సమయంలో టమోటా రైతులకు భారీ గిట్టుబాటు లభిస్తుంది. లక్షలు సంపాదిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ టమోటా ధరలు కొందరు రైతుల పాలిట శాపంగా మారింది. టమోటా వ్యాపారుదారులను టార్గెట్ చేస్తున్నారు దుండగులు. పలు చోట్ల హత్యలు జరిగాయి. తాజాగా ఏపీలో టమోటా వ్యాపారి అంటే రైతుపై దుండగులు దాడి చేసి అతి కిరాతంగా హత్య చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం బోడిమల్లదిన్నె గ్రామానికి దూరంగా వ్యవసాయ పొలంలో ఉంటున్న రైతు నరెం రాజశేఖర్‌రెడ్డి (62) హత్యకు గురయ్యాడు. పాలు పోసేందుకు వేరే గ్రామానికి వెళ్తున్నాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టమాటా కొనే నెపంతో పొలానికి వచ్చారని అతని భార్య పోలీసులకు తెలిపింది. భర్త బయటకు వెళ్లాడని ఆమె చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ దుండగులు. అయితే మార్గ మధ్యన టమోటా రైతును గుర్తించి దాడికి పాల్పడ్డారు. దుండగులు అతడిని అడ్డగించి చేతులు, కాళ్లు కట్టేసి గొంతుకోసి హత్య చేశారు. విపరీతంగా పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల వ్యవసాయ మార్కెట్‌లో టమోటాలు విక్రయించడం ద్వారా రైతు రూ.30 లక్షలు సంపాదించినట్లు సమాచారం. టమాటా అమ్మి వచ్చిన డబ్బును దోచుకునేందుకు వచ్చి రైతును హత్య చేయడం అత్యంత బాధాకరం.

Read More: Fake woMarriages: బడాబాబులకు ప్రేమ వల.. 8 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు