Site icon HashtagU Telugu

Andhra Pradesh : న‌ల్ల‌మ‌ల‌లో మ‌రో పులి మృతి

Tiger Bengal

Tiger Bengal

నాగార్జునసాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంలో చనిపోయిన పులిని అట‌వీశాధికారులు గుర్తించారు. నల్లమల ఆత్మకూర్‌ డివిజన్‌ ​​అటవీ పరిధిలోని వెలుగోడు వ‌ద్ద నీటి మడుగు సమీపంలో పెద్ద పులి కళేబరంను కొనుగొన్నారు.
ఆ మేర‌కు అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పులి నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయస్సు ఉంటుంది. అడవి పందులు లేదా ఇతర చిన్న జంతువులను పట్టుకునేందుకు గుర్తు తెలియ‌న వ్య‌క్తులు పన్నిన ఉచ్చులో పులి చిక్కుకుంద‌ని అధికారులు ప్రాథ‌మికంగా అనుమానిస్తున్నారు.

ఉచ్చులో నుంచి బ‌య‌ట‌ప‌డిన పులి మెడపై గాయాలు ఉన్న‌ట్టు గుర్తించారు. ఆ గాయాలు మెడ చుట్టూ ఉన్న భాగంకు సోక‌డం ద్వారా నెమ్మదిగా చనిపోయి ఉంటుంద‌ని ”అని అధికారులు భావిస్తున్నారు. మార్కాపూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జి విఘ్నేష్ అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం `రెండు మూడు రోజుల క్రితమే పులిని బంధించి ఉండవచ్చు. పులి శరీరం చెక్కుచెదరకుండా ఉంది. ఇన్ఫెక్షన్ కారణంగా పులి వల నుండి తప్పించుకుని చనిపోయి ఉండవచ్చు` అంటూ అట‌వీశాఖ అనుమానిస్తోంది.

ప్రొటోకాల్ ప్రకారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేశారు. ఈ ఏడాది నల్లమల అడవుల్లోని నాగార్జునసాగర్‌ శ్రీశైలం పులుల అభయారణ్యం (ఎన్‌టీఎస్‌ఆర్‌)లో పులి మృతి చెందడం ఇది మూడో సంఘ‌ట‌న‌.
మే 11న నల్లమల అడవుల్లో అనుమానాస్పద స్థితిలో ఓ పెద్ద పిల్లి మృతి చెందింది. ఫిబ్రవరి 5, 2022న కండలేరు జలాశయం సమీపంలో ఒక పులి చనిపోయినట్లు గుర్తించబడింది.

Pic: File Photo