తీవ్రంగా పెరిగిన రైతుల ఆత్మహత్యలు.. టాప్ లో రెండు తెలుగు రాష్ట్రాలు

కేంద్రం తెస్తున్న నూతన రైతు చట్టాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలోనే రైతుల ఆత్మహత్యలకు సంబందించిన తాజా సెన్సెక్స్ సమాజాన్ని కలవరపెడుతోంది.

  • Written By:
  • Updated On - October 30, 2021 / 11:48 AM IST

కేంద్రం తెస్తున్న నూతన రైతు చట్టాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలోనే రైతుల ఆత్మహత్యలకు సంబందించిన తాజా సెన్సెక్స్ సమాజాన్ని కలవరపెడుతోంది.

2019తో పోలిస్తే 2020లో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు 18 శాతం పెరిగాయని నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో తెలిపింది.

2020లో దేశవ్యాప్తంగా 10,677 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ జాబితాలో మహారాష్ట్ర టాప్‌లో నిలిచిందని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. గతేడాది ఆ రాష్ట్రంలో నాలుగువేల ఆరుమంది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారట.

రైతుల ఆత్మహత్యల్లో రెండు తెలుగు రాష్ట్రాలు టాప్ లోనే ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత
2,016 మంది రైతుల ఆత్మహత్యలతో కర్ణాటక రాష్ట్రం రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో తెలంగాణ ఉన్నాయి.

గతేడాది ఆంధ్రప్రదేశ్లో 563 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, తెలంగాణలో 466 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఐదో స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది.

2020లో దేశవ్యాప్తంగా మొత్తం 1,53,052 మంది ఆత్మహత్య చేసుకోగా దానిలో 7% రైతులున్నారు. 365 రోజుల్లో 10,677 రైతులు బలవన్మరణం చెందారు. వీరిలో 5579 మంది రైతులు, 5098 మంది వ్యవసాయ కూలీలున్నారు.

తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై సీరియస్ గా అలోచించాల్సిన అవసరం ఉంది. చట్టాలు కార్పొరేట్ వ్యవస్థలకు బెనిఫిట్ అయ్యేలా కాకుండా రైతులు లాభపడేలా, రైతులకు ఉపయోగపడేలా రూపొందించకపోతే భవిషత్తులో రాబోయే ఆహార సంక్షోభానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కారణమైన వాళ్లవుతారు.