Andhra Pradesh : వలంటీర్ల సమావేశం లో తొడగొట్టిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

వచ్చే ఎన్నికల్లో జగన్‌కే (Jagan) ఓటేస్తానని ఓ మహిళ తొడకొట్టి చెప్పిందంటూ ఆమెను అనుకరిస్తూ తొడకొట్టారు.

Published By: HashtagU Telugu Desk
Thammineni

Andhra Pradesh Speaker Thammineni Sitaram Ycp Minister

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభాపతి తమ్మినేని సీతారాం తొడకొట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కే ఓటేస్తానని ఓ మహిళ తొడకొట్టి చెప్పిందంటూ ఆమెను అనుకరిస్తూ తొడకొట్టారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు కె.గోవిందరావు అధ్యక్షతన నిన్న కన్వీనర్లు, వలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. హాజరైన తమ్మినేని మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విరుకుపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు రుణ మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని, అందుకే గత ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.

నారావారి పల్లెలో రెండెకరాల భూమి ఉన్న చంద్రబాబునాయడు ఇప్పుడు కోటీశ్వరుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఆయన వద్ద ఉన్న ఆ మంత్ర దండాన్ని పేదలకు ఇస్తే రాష్ట్రంలో నిరుపేదలంటూ ఎవరూ ఉండరని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వలంటీరు వ్యవస్థను పీకేస్తామని చెబుతున్నారని సీతారాం అన్నారు. వలంటీర్లను ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తుందని అన్నారు.

Also Read:  Guntur TDP : నేడు గుంటూరులో ‘చంద్రన్న కానుక’ పంపిణీ

  Last Updated: 01 Jan 2023, 10:29 AM IST