Cockfights Race : సంక్రాంతి అనగానే ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా జరిగే కోడిపందేలు గుర్తుకు వస్తాయి. ప్రత్యేకించి రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల్లో కోడిపందేలు వందల కోట్ల రేంజులో జరుగుతుంటాయి. తాజాగా సోమవారం ఒక్కరోజే రూ.330 కోట్ల మేరకు కోడిపందేలు జరిగాయట. ఇందులో రూ.175 కోట్లు విలువైన కోడి పందేలు ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జరిగాయట. రూ.100 కోట్లు విలువైన కోడిపందేలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో నిర్వహించారట. ఈక్రమంలో గోదావరి జిల్లాల్లో 350 మంది పందెం రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1800 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Elon Musk – TikTok : అమెరికాలో టిక్‌టాక్ ఎలాన్ మస్క్ చేతికి.. ఎందుకు ?
బరులు సాగాయి ఇలా..
- కోనసీమ జిల్లాలో 430 బరుల్లో కోడి పందేలు సాగుతున్నాయి.
- కాకినాడ జిల్లాలో 410 బరులు, తూర్పుగోదావరి జిల్లాలో 300 బరులు ఏర్పాటు చేశారు.
- పిఠాపురం నియోజకవర్గంలో 60 చోట్ల కోడి పందేలు జరిగాయి. అక్కడ టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా బరులు నిర్వహించారు.
- పలుచోట్ల కోడిపందేల బరుల వద్ద ఫైనాన్స్ వ్యాపారులు(Cockfights Race) భారీగా గుమిగూడారు. తక్షణం అప్పులు ఇచ్చేందుకు వీలుగా నోట్ల కట్టలతో సిద్ధమయ్యారు.
- కోడి పందేలను డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
- యలమంచిలి, వీరవాసరం మండలం నవుడూరులో కోడిపందేల సందర్భంగా విందు భోజనాల ఏర్పాట్లు కూడా చేశారు.
- ఏలూరు జిల్లాలో కోడి పందేల్లో పాల్గొన్న వారికి బిర్యానీ ఇచ్చేందుకు పాస్‌లు జారీ చేశారు.
- పశ్చిమ గోదావరి జిల్లాలో బైక్‌లు, స్కూటర్లు, బంగారు నాణేల ఆఫర్లు పందెం రాయుళ్లను ఆకట్టుకుంటున్నాయి.
- కడప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేలు నిర్వహిస్తున్నారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి బరుల వద్దకు వెళ్లి పరిశీలించినట్లు తెలిసింది.
- జక్కంపూడిలోని పాములకాల్వ వద్ద టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన బరిని ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు.
- ఒక క్యాసినో కింగ్‌కు చెందిన అనుచరులు కృష్ణాజిల్లాలో క్యాసినోను రహస్యంగా నిర్వహిస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.