Viral Video: నీటిలో మునిగిన కుక్క పిల్లలను కాపాడిన ఏపీ పోలీసులు: తల్లి ప్రేమ

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. దీంతో అత్యవసర పరిస్థితిల్లో ఉన్న వ్యక్తుల్ని స్థానిక పోలీసులు రోడ్లు దాటిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Viral Video

New Web Story Copy 2023 07 30t130900.973

Viral Video: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. దీంతో అత్యవసర పరిస్థితిల్లో ఉన్న వ్యక్తుల్ని స్థానిక పోలీసులు రోడ్లు దాటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ తల్లి కుక్క పోలీసుల వద్దకు వచ్చి ఎదో చెప్పాలనుకుంది. ఈ క్రమంలో జాలిగా వారివైపు చూస్తూ ఏడవడం మొదలుపెట్టింది. అర్ధం చేసుకున్న పోలీసులు కుక్కని వెంబడించారు. పరిసర ప్రాంతంలో తల్లి కుక్క పిల్లలు నీటిలో మునిగి ఉండటం గమనించారు. దీంతో నీటిలో అల్లాడుతున్న కుక్క పిల్లలను రక్షించి తల్లికి అప్పజెప్పారు పోలీసులు సాయానికి తల్లి కుక్క ప్రేమగా వారి మీదకు ఎగబాకి తన ప్రేమను, కృతజ్ఞతను తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తుంది. వీడియోని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జంతువుల పట్ల విజయవాడ నగర పోలీసులు మానవత్వంతో వ్యవహరించినందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Also Read: PM Kisan 14th Installment: పీఎం కిసాన్ యోజన డబ్బు మీ ఖాతాలోకి రాలేదా.. వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేయండి..!

  Last Updated: 30 Jul 2023, 01:14 PM IST