YS Sharmila : వైఎస్ షర్మిలకు భద్రత పెంపు ..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదైనా జరగొచ్చు..బాత్రూం మర్డర్లు..వేటకొడవళ్లతో నరికి చంపడం..నేతలను బెదిరించడం ఇలా ఏమైనా..ఎవరికైనా..ఎవర్నైనా చేయొచ్చు. అందుకే నేతలంతా పోలీసుల వద్ద భద్రత కోరుకోవడం చేస్తున్నారు. తాజాగా ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న వైస్ షర్మిల సైతం తనకు భద్రత కల్పించాలని కోరడం తో కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆమెకు 2+2 గన్ మెన్లను కేటాయించారు. We’re now on WhatsApp. Click to Join. ఈ మధ్యే పీసీసీ ఛీఫ్ గా […]

Published By: HashtagU Telugu Desk
In That Regard, Sister Is Better Than Her Brother. Sharmila's Courage Must Be Appreciated!..

In That Regard, Sister Is Better Than Her Brother. Sharmila's Courage Must Be Appreciated!..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదైనా జరగొచ్చు..బాత్రూం మర్డర్లు..వేటకొడవళ్లతో నరికి చంపడం..నేతలను బెదిరించడం ఇలా ఏమైనా..ఎవరికైనా..ఎవర్నైనా చేయొచ్చు. అందుకే నేతలంతా పోలీసుల వద్ద భద్రత కోరుకోవడం చేస్తున్నారు. తాజాగా ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న వైస్ షర్మిల సైతం తనకు భద్రత కల్పించాలని కోరడం తో కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆమెకు 2+2 గన్ మెన్లను కేటాయించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మధ్యే పీసీసీ ఛీఫ్ గా ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల..అధికార పార్టీ ఫై విమర్శల దాడి చేస్తుంది..ఓ పక్క ప్రభుత్వం ఫై ఆరోపణలు , విమర్శలు చేస్తూనే.. జగనన్నా, జగనన్నా అంటూ అన్న ఫై కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసేస్తున్నారు. దీంతో వైసీపీ అభిమానులు షర్మిల ను సోషల్ మీడియాలో తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. అలాగే బయట కూడా షర్మిలపై దాడులకు దిగే ప్రమాదం ఉందన్న సంకేతాలు అందుతున్నాయి.

ఈ నేపథ్యంలో భద్రత పెంపు కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు ప్రభుత్వ వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె అధికారికంగా కోరడంతో వైఎస్సార్ జిల్లా పోలీసులు ఆమెకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ ఓ ప్రకటన విడుదల చేశారు. వై.ఎస్ షర్మిల అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ నుండి టూ ప్లస్ టూ గా భద్రత పెంచామని తెలిపారు. ప్రస్తుతం షర్మిల..జిల్లాల పర్యటన చేస్తున్నారు.

Read Also : TS : రేపు కేసీఆర్ బదులు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా..? : సీఎం రేవంత్

  Last Updated: 08 Feb 2024, 05:40 PM IST