Site icon HashtagU Telugu

Repalle Incident : జ‌గ‌న్ పై రేప‌ల్లె రేప్ పోరు

Tdp Janasena Flags

Tdp Janasena Flags

రేపల్లె రైల్వే స్టేష‌న్లో జ‌రిగిన సామూహి అత్యాచారం సంఘ‌ట‌న క్ర‌మంలో రాష్ట్రంలోని లా అండ్ ఆర్డ‌ర్ ప‌రిస్థితుల‌పై విప‌క్షాలు, ప్ర‌జా, ద‌ళిత సంఘాలు ఆందోళ‌న‌కు దిగాయి. శాంతిభద్రతల వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, జనసేన, ఎమ్మార్పీఎస్ సహా పలు ప్రజా సంఘాలు సంయుక్తంగా రేపల్లె ప్ర‌భుత్వ ఆసుపత్రి వద్ద ధ‌ర్నాల‌కు దిగ‌డం ప్ర‌భుత్వానికి స‌వాల్ గా మారింది.

రేపల్లె ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు. బాధితురాలికి ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారం అందించి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు కుమారుడు రాజీవ్ రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. బాధితురాలి భ‌ర్త‌కు మెరుగైన వైద్యం అందించేందుకు ఒంగోలు ప్ర‌భుత్వ‌ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి బంధువులు, గ్రామస్తులు, ప్రతిపక్ష నాయకులు ఆమెను పరామర్శించేందుకు రిమ్స్‌కు వచ్చారు. పోలీసులు గేట్లు మూయడంతో రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే స్వామిని అరెస్ట్ చేసి వెళ్లగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది.

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, కలెక్టర్ దినేష్ కుమార్ బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఒక తల్లిగా, ఒక మహిళగా ఈ సంఘటన పట్ల నేను చాలా బాధపడ్డాను, దోషులను కఠినంగా శిక్షిస్తానని, బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె అన్నారు.మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధితులను పరామర్శించనున్నారు.

Exit mobile version