Rain Alert : వారం రోజుల పాటు ఏపీకి భారీ వ‌ర్షాలు-వాతావ‌ర‌ణ శాఖ‌

డిసెంబ‌ర్ రెండ‌వ తేదీ వ‌ర‌కు ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

  • Written By:
  • Publish Date - November 26, 2021 / 01:02 PM IST

డిసెంబ‌ర్ రెండ‌వ తేదీ వ‌ర‌కు ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నవంబర్ 26 మరియు డిసెంబర్ 2 మధ్య చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చ‌రించింది. అయితే ఇప్ప‌టికే రాయలసీమ మరియు దక్షిణ కోస్తాలో వ‌ర్షాలు కురుస్తున్నాయి.భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. కడప జిల్లాలో ఇప్పటికే అనేక చెరువులు పూర్తి స్థాయిలో నిండి, దిగువ ప్రాంతాలే ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చ‌రించారు. ఉటుకూరు, కృష్ణారెడ్డి సరస్సుల దిగువన ఉన్న గ్రామాలతోపాటు గాలివీడు, నగరిపాడు, పుట్టంపల్లి, చింతకుంట, చిట్లూరు, శిట్యాల, పొలిపెద్ద, సీకే దిన్నె చెరువులు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాలను అప్రమత్తం చేయాలని స్థానిక అధికారులకు జిల్లా అధికారులు తెలిపారు. తాజా ఇన్ ఫ్లోల కారణంగా ఈ చెరువులు తెగిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చ‌రించారు.

తిరుపతి పోలీసు సూపరింటెండెంట్ సిహెచ్ వెంకట అప్పల నాయుడు కూడా ఇదే హెచ్చరిక జారీ చేసి ప్రజల సహకారం కోరారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు సహాయక శిబిరాలకు వెళ్లాల‌ని…తమ విలువైన వస్తువులను భద్రప‌రుచుకోవ‌ల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, పాత ఇళ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎస్పీ అధికారుల‌కు సూచించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ మరియు ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.సోషల్ మీడియా మరియు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వ్యాపించే పుకార్లను న‌మ్మోద్ద‌ని ప్ర‌జ‌ల‌కు తెలిపారు. వాహనదారులు నీటితో నిండిన రోడ్లపై జాగ్రత్తగా నడపాలని.. ఓపెన్ మ్యాన్‌హోల్స్‌లో వ‌ద్ద అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలిపారు. వృద్ధులు, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు.నవంబర్ 26 నుండి డిసెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్,అధికారులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. ల‌క్ష్మీపల్లి, గొడ్డుమర్రి గ్రామాల వాసులకు సహాయక శిబిరాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని క‌లెక్ట‌ర్ తెలిపారు.

పెన్నార్ నదీ పరీవాహక ప్రాంతం (చేయూరు, లోయర్ పెన్నార్, పాపాగ్ని), కళింగి మరియు స్వర్ణముఖిలో మోస్తరు నుండి భారీ వర్షాలు (12-20 సెం.మీ మధ్య) కురిసే అవకాశం ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) కూడా హెచ్చరిక జారీ చేసింది. చెయ్యూరు ఉప పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమశిల ఆనకట్టకు గణనీయమైన ఇన్ ఫ్లో వచ్చే అవకాశం ఉంది. పాపాగ్ని ఉప పరివాహక ప్రాంతం నుంచి సోమశిలకు ఇదేవిధంగా ఇన్ ఫ్లోలు వచ్చే అవకాశం ఉంది.