Bride Death: ‘సృజన మృతి’ పై వీడిన మిస్టరీ!

విశాఖపట్నం మధురవాడలో వధువు సృజన మృతిపై మిస్టరీ ఎట్టకేలకు వీడింది.

Published By: HashtagU Telugu Desk
Bride

Bride

విశాఖపట్నం మధురవాడలో వధువు సృజన మృతిపై మిస్టరీ ఎట్టకేలకు వీడింది. సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పెళ్లి ఆపే ప్రయత్నంలో సృజన ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. పెళ్లికి మూడు రోజుల ముందు ఆమె తన బాయ్‌ఫ్రెండ్ మోహన్‌తో తమ పెళ్లి విషయమై ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌ చేస్తోందని తెలిపారు. సృజన గత ఏడేళ్లుగా పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని విచారణలో తెలిసింది. సృజన మరణం తరువాత విచారణ మొదలు పెట్టిన పోలీసులు.. ఆమె ఫోన్ ను స్వాధీనంచేసుకొని పరిశీలించారు. అయితే సృజన ఫోన్ నుంచి కొన్ని నెంబర్లు, మెస్సేజ్ లు కుటుంబ సభ్యులు డిలిట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిని కుటుంబ సభ్యులు ఖండించారు. కాగా పోలీసుల విచారణలో భాగంగా కాల్ డయల్ రికార్డర్ తో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. తోకాడ మోహన్ అనే వ్యక్తితో సృజన ఏడేళ్లుగా ప్రేమలో ఉంది.

సరైన ఉద్యోగం లేకపోవడంతో మోహన్ పెళ్లికి నిరాకరిస్తూ వచ్చాడు. సరియైన ఉద్యోగం చూసుకోగానే పెళ్లిచేసుకుంటానని సృజనకు హామీ ఇచ్చాడు. ఇంతలోనే కుటుంబ సభ్యులు సృజనకు పెళ్లి సంబంధం చూడటం మొదలుపెట్టారు. అయితే పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తానని ప్రియుడికి చెప్పి విషం తాగి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది.  ఈనెల 11న విశాఖపట్నం శివార్లలోని మధురవాడ నగరంలోని పాలెంలో నాగోటి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. కళ్యాణ మండపంలో సృజన ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

  Last Updated: 23 May 2022, 01:46 PM IST