Site icon HashtagU Telugu

Lance Naik Sai Teja: హెలికాఫ్టర్ ప్రమాదానికి కొద్దిసేపటి ముందే భార్య, పిల్లలతో మాట్లాడిన సాయితేజ

lance naik sai teja

Andhra Pradesh jawan Lance Naik Sai Teja among 13 slain in chopper crash

రక్షణ శాఖ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ రవితేజ కూడా మృతి చెందారు.

చిత్తూరు జిల్లా ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ 2013లో ఆర్మీలో చేరారు. రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వహిస్తున్న సాయితేజ ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటీ గా ఉన్నారు.

Lance Naik Sai Teja 

ప్రమాదం జరిగినరోజు ఉదయం సాయితేజ తన భార్యతో ఫోన్లో మాట్లాడినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ప్రమాదం జరగడానికి కొన్నిగంటల ముందు సాయితేజ వీడియో కాల్ చేసి తన భార్య, కుమార్తె, కుమారుడితో మాట్లాడారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగింది.

సాయితేజ 2013లో బెంగళూరు రెజిమెంట్ నుంచి ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. సిపాయిగా పనిచేస్తూనే ఏడాది తర్వాత పారా కమాండో పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. అనంతరం 11వ పారాలో లాన్స్ నాయక్ హోదాలో పనిచేస్తున్నారు. ఏడాది క్రితం వరకు బెంగళూరులోని సిపాయిల శిక్షణా కేంద్రంలో శిక్షకుడిగా పనిచేసిన సాయితేజ ఇటీవలే సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా బృందంలో సభ్యుడిగా నియమితులయ్యారు.