Nara Lokesh : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆదివారం ఉదయం పవిత్ర శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను సందర్శించే భాగ్యం దక్కినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపిన సమయం ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చిందని తెలిపారు.అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థించానని నారా లోకేష్ చెప్పారు. మంత్రి నారా లోకేశ్‌తో పాటు భార్య బ్రాహ్మణి(Nara Lokesh), తనయుడు దేవాంశ్‌లు స్వర్ణ దేవాలయంలోని కొలను, లంగర్‌లను సందర్శించారు.
Also Read :KTRs Convoy : కేటీఆర్ కాన్వాయ్‌లో అపశృతి.. ఏమైందంటే..
దివాకరపల్లి సమీపంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు గత సంవత్సరమే రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. ప్రకాశం జిల్లాలోని పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణానికి ఏప్రిల్ 2న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పదివేల మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ప్రకాశం జిల్లాలోని కరవు పరిస్థితుల వల్ల స్థానికులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. స్థానికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
Also Read :Ravindra Jadeja: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రవీంద్ర జడేజా!
ఒక్కో ప్లాంటుకు రూ.131 కోట్లు..
దివాకరపల్లి సమీపంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటయ్యాక.. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ప్లాంట్లను విస్తరిస్తారు. ఒక్కో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం రిలయన్స్ సంస్థ రూ.131 కోట్లు ఖర్చుచేస్తోంది. బయోగ్యాస్ ఉత్పత్తి కోసం బంజరుభూముల్లో ప్రత్యేకమైన గడ్డిని పెంచనున్నారు. ఇందుకోసం 2000 ఎకరాల భూమి అవసరం. అధికారులు ఇప్పటికే సర్వే చేసి 12,103 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. వీటిలో ఆరు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తొలి విడతలో భాగంగా 500 ఎకరాల్లో ఒక ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు.