Fake IPS Officer : పవన్ కళ్యాణ్ పర్యటనలో ఫేక్ ఐపీఎస్.. ఏపీ హోం మంత్రి సీరియస్

మన్నెం జిల్లా పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ‘వై కేటగిరి’ (Fake IPS Officer) సెక్యూరిటీని కల్పించారు. 

Published By: HashtagU Telugu Desk
Fake Ips Officer Pawan Kalyan Ap Deputy Cm Andhra Pradesh Home Minister

Fake IPS Officer : నకిలీ ఐపీఎస్ అధికారి హల్‌చల్ చేశాడు. సెక్యూరిటీ విధుల్లో ఉన్నట్టుగా నటిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగాడు. ఈ నాటకమంతా ఆడిన బలివాడ సూర్యప్రకాశరావును నిజమైన ఐపీఎస్ అధికారే అని భావించి..  పోలీసు సిబ్బంది సెల్యూట్లు  కొట్టారు. కొంతమంది ఏకంగా అతగాడితో ఫోటోలు కూడా దిగారు. ఇటీవలే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ మండలం బాగోజాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌  పర్యటన సందర్భంగా ఈ ఫేక్ ఐపీఎస్ అధికారి హల్‌చల్ చేశాడు. ఇటీవలే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ మండలం బాగోజాలలో పవన్ కల్యాణ్ పర్యటన వేళ బలివాడ సూర్యప్రకాశరావు నడిరోడ్డుపై అందరి ముందే ఈ నాటకం ఆడాడు. నకిలీ ఐపీఎస్ అవతారంలో హడావుడి చేసిన అతగాడిని  విజయనగరం జిల్లా గరివిడికి చెందిన సూర్యప్రకాష్‌గా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో కలకలం రేగింది. నకలీ ఐపీఎస్ అధికారి వ్యవహారం వల్ల డిప్యూటీ సీఎంకు భద్రత కల్పించడంలో వైఫ్యలం  జరిగిందనే చర్చ మొదలైంది. మన్నెం జిల్లా పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ‘వై కేటగిరి’ (Fake IPS Officer) సెక్యూరిటీని కల్పించారు.  అతడు నకిలీ వ్యక్తి అని తెలిసిన వెంటనే పోలీసులు అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు.

Also Read :Manmohan Friend : పాకిస్తాన్‌కు చెందిన ఫ్రెండ్ రజాతో మన్మోహన్ కలిసిన వేళ..

ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ భద్రతలో జరిగిన లోపాలపై దర్యాప్తు చేయించి, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ ఘటనపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు ఉన్నతాధికారులకు ఆమె సూచనలు చేశారు. ఫేక్ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశించారు.  డిప్యూటీ సీఎం ఎంతోమంది ఐపీఎస్‌ల భద్రత నడుమ ఉండగా.. ఇలా ఒక నకిలీ వ్యక్తి ఐపీఎస్ డ్రస్సులో పవన్ కళ్యాణ్ సమీపంలోకి రావడాన్ని పోలీసు శాఖ కూడా సీరియస్‌గా తీసుకుంటోంది. ఇక ఈ విషయం జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా ఆందోళన కలిగించింది.

  Last Updated: 28 Dec 2024, 01:08 PM IST