Film Ticket Issue: పుష్ప‌, RRR కు శుభ‌వార్త‌.. జ‌గ‌న్ కు హైకోర్టు సినిమా!

పుష్ప‌, త్రిబుల్ ఆర్ సినిమాల‌కు హైకోర్టు ల‌క్కీ ఛాన్స్ ఇచ్చింది. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను నియంత్రిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో నెం 35ను ర‌ద్దు చేసింది. డిస్ట్రిబ్యూట‌ర్లు టిక్కెట్ల ధ‌ర‌ల‌ను నిర్దేశించుకోవ‌చ్చ‌ని ఆదేశించింది. పాత ధ‌రల విధానానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. దీంతో అల్లు అర్జున్ సినిమా పుష్ప‌, త్రిబుల్ ఆర్ సినిమాల‌కు క‌లెక్ష‌న్ల పండ‌గ కుర‌వ‌నుంది.

  • Written By:
  • Updated On - December 14, 2021 / 10:13 PM IST

పుష్ప‌, త్రిబుల్ ఆర్ సినిమాల‌కు హైకోర్టు ల‌క్కీ ఛాన్స్ ఇచ్చింది. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను నియంత్రిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో నెం 35ను ర‌ద్దు చేసింది. డిస్ట్రిబ్యూట‌ర్లు టిక్కెట్ల ధ‌ర‌ల‌ను నిర్దేశించుకోవ‌చ్చ‌ని ఆదేశించింది. పాత ధ‌రల విధానానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. దీంతో అల్లు అర్జున్ సినిమా పుష్ప‌, త్రిబుల్ ఆర్ సినిమాల‌కు క‌లెక్ష‌న్ల పండ‌గ కుర‌వ‌నుంది.
ఏపీ ప్ర‌భుత్వానికి మ‌రోసారి హైకోర్టు మొట్టికాయ‌లు వేసింది. ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోల‌ను ర‌ద్దు చేయ‌డం ఇదేం కొత్త కాదు. గ‌తంలోనూ ప‌లుమార్లు హైకోర్టు ర‌ద్దు చేసిన అంశాలు ఉన్నాయి. అయితే, ఈసారి సినిమా పెద్ద‌ల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య ప‌లు విధాలుగా చ‌ర్చ జ‌రిగింది. పాపుల‌ర్ హీరోలు రెండుసార్లు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో 35 మీద టాలీవుడ్ భిన్నంగా స్పందించింది. కొంద‌రు భేష్ అంటే ఇంకొంద‌రు విమ‌ర్శించారు. సినిమాల‌ను ఫ్రీగా ఆడిస్తానంటూ వెల్ల‌డించాడు ప‌వ‌న్‌.
జ‌న‌సేనాని ప‌వ‌న్ సినిమాల‌కు న‌ష్టం చేయాల‌ని సీఎం జ‌గ‌న్ కొత్త జీవోను విడుద‌ల చేశాడ‌ని ఆయ‌న అభిమానులు ప్ర‌చారం చేసుకున్నారు. ఆయ‌న కార‌ణంగా సినిమా ప‌రిశ్ర‌మ మొత్తం మూత‌ప‌డే ప‌రిస్థితికి వ‌చ్చింద‌ని చాలా మంది విమ‌ర్శ‌లు గుప్పించారు. సినిమా వ‌సూళ్లు ఎక్కువ‌గా ఆంధ్రా, సీడెడ్ నుంచి వ‌స్తుంటాయి. తెలంగాణ వ‌సూళ్ల‌తో పోల్చుకుంటే, ఏపీ క‌లెక్ష‌న్లు ఎక్కువ‌.
పాపుల‌ర్ హీరోల సినిమాలు విడుద‌ల సంద‌ర్భంగా థియేట‌ర్ల‌ను బ్లాక్ చేయ‌డం అన‌వాయితీగా మారింది. సినీ. ప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రు థియేట‌ర్ మాఫీయాగా ఏర్ప‌డి ఈ దందాను కొన‌సాగిస్తున్నారు. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను తొలి వారం అనూహ్యంగా పెంచుకుంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితిని క‌ట్ట‌డీ చేసేలా ఏపీ ప్ర‌భుత్వం జీవో నెం 35ను తీసుకొచ్చింది. ఆన్ లైన్ విధానం ద్వారా టిక్కెట్ల అమ్మ‌కాన్ని పెట్టింది. ఇష్టానుసారంగా ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి లేద‌ని తేల్చేసింది. బెనిఫిట్ షోలు ఉండ‌వ‌ని ఆ జీవో సారాంశం. దీంతో పెద్ద హీరోల సినిమాల‌కు క‌ళ్లెం ప‌డింది.
ఈ జీవోను స‌వాల్ చేస్తూ సినీ ప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రు హైకోర్టుకు వెళ్లారు. విచార‌ణ చేసిన త‌రువాత జీవోను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.