Site icon HashtagU Telugu

Heavy Rains: 18న ఏపీలో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..!

Weather Update

Hyd Rains Imresizer

పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ఒకటి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు మరో ద్రోణి ఏర్పడిందని, ఈ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి ఏపీ వైపు తేమ గాలులు వీస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా ఈ నెల 16వ తేదీ కంటే ఒకరోజు ముందుగానే వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందుగా అంచనా వేసింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.

Also Read: Khammam Politics : పొంగులేటికి పోటీగా ఖ‌మ్మంలో మంత్రి పువ్వాడ ఆత్మీయ స‌మ్మేళ‌నాలు

శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి సీతామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, వైఎస్‌ఆర్‌, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మార్చి 17, 18, 19 తేదీల్లో ఎన్టీఆర్, కృష్ణా, పలనాడు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పంటలు నష్టపోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, మంగళవారం కర్నూలు జిల్లా మంత్రాలయంలో 40.65, నంద్యాల జిల్లా గాజులపల్లిలో 40.61, అవుకు 40.53, గోనవరంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి.