AP Rains : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాల విరాళం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టంచేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా 1.5–1.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రేపు (సెప్టెంబర్ 2) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని కారణంగా తూర్పు గాలులు బలంగా వీచి, తీర ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరుగుతుందని ఆయన తెలిపారు.
Distribution of Pensions : నేడు రాజంపేటలో పెన్షన్ల పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
ఈ రోజు (సెప్టెంబర్ 1) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
తీరం వెంబడి గంటకు 40–60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా గురువారం (సెప్టెంబర్ 4) వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టమైన సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే ప్రమాదం ఉందని, వరదలు, విద్యుత్ అంతరాయం, రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు సూచించారు.