ఐగాట్ కర్మయోగి ప్లాట్‌ఫామ్‌పై కోటికి పైగా కోర్సు ఎన్‌రోల్‌మెంట్లు, 80 లక్షలకు పైగా కోర్సుల పూర్తితో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ఉద్యోగులు మొత్తం 4,290 కోర్సులలో ఈ శిక్షణ పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థను (APSDPS) సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
కేంద్ర ప్రభుత్వం సైతం ఆంధ్రప్రదేశ్ సాధించిన ఈ ఘనతను ప్రశంసించింది. ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పౌర సేవలపై సానుకూల ప్రభావం చూపడంలో రాష్ట్రం ముందుందని కొనియాడింది. ఏపీ సాధించిన ఈ విజయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొంది. ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని పెంపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతకు ఇది నిలువుటద్దమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
