Clean Energy Policy : అద్భుతంగా ‘క్లీన్ ఎనర్జీ పాలసీ’.. చంద్రబాబు విజన్‌పై యావత్ దేశంలో చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం చాలావరకు సంప్రదాయ ఇంధన వనరులపైనే(Clean Energy Policy) ఆధారపడి ఉంది.

Published By: HashtagU Telugu Desk
Cm Chandra Babu Ap Clean Energy Policy 2025

Clean Energy Policy : చంద్రబాబు అంటేనే రోల్ మోడల్ ముఖ్యమంత్రి. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన బాటను అనుసరిస్తుంటారు. జన జీవితాలను మెరుగుపర్చే విప్లవాత్మక విధానాల అమలుకు శ్రీకారం చుట్టడం అనేది చంద్రబాబుకే ప్రత్యేకం. ఆయన సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్‌ సర్కారు తాజాగా అమల్లోకి తెచ్చిన సమీకృత స్వచ్ఛ ఇంధన పాలసీ(ICE) గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాలుష్య రహిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలనే విజన్‌తో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ పాలసీని జాతీయ మీడియా సైతం ప్రశంసిస్తూ కథనాలను ప్రచురిస్తోంది. క్లీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీని మార్చాలనే చంద్రబాబు సంకల్పాన్ని కొనియాడుతోంది. ఇంతకీ ఈ పాలసీలో ఏముంది అనేది కథనంలో తెలుసుకుందాం..

Also Read :Social Robots : మనుషుల మనసెరిగిన ఏఐ సోషల్ రోబోలు.. ఫీచర్లు ఇవీ

క్లీన్ ఎనర్జీ పాలసీతో ఏం జరగబోతోంది ? 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం చాలావరకు సంప్రదాయ ఇంధన వనరులపైనే(Clean Energy Policy) ఆధారపడి ఉంది.
  • క్రమక్రమంగా, విడతల వారీగా ఏపీలో క్లీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచాలనేది క్లీన్ ఎనర్జీ పాలసీ లక్ష్యం.
  • వాతావరణంలోకి విడుదల చేసే కాలుష్య ఉద్గారాల స్థాయిని సున్నా స్థాయికి తగ్గించాలనే టార్గెట్‌తో భారత సర్కారు ముందుకు సాగుతోంది. ఈ దిశగా దేశ మిషన్‌ను సాకారం చేసే సంకల్పంతో క్లీన్ ఎనర్జీ పాలసీని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
  • ఈ పాలసీ ప్రధానంగా 4టీలపై ఆధారపడి అమలవుతుంది. ట్రెండ్స్, టెక్నాలజీ, ట్రాన్స్‌ఫార్మేషన్, ట్రేడ్ అనే 4టీలను లక్ష్యంగా చేసుకొని ఈ పాలసీని అమలు చేయనున్నారు.
  • ఈక్రమంలో ‘ఏజీ అండ్ పీ ప్రథమ్ – థింక్ గ్యాస్’‌తో కలిసి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇంటింటికి కాంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ),  పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ)ను సప్లై చేసే పైలట్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు.
  • క్లీన్ ఎనర్జీ వ్యాపార విభాగంలో 2047 నాటికి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.  తద్వారా ఆ సమయానికి ఏపీలో 7.5 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయి.
  • క్లీన్ ఎనర్జీని ఇళ్లు, పరిశ్రమలు, రవాణా వ్యవస్థకు వినియోగించుకోనున్నారు.
  • క్లీన్ ఎనర్జీ వ్యవస్థల ఏర్పాటుకు జపాన్ సర్కారు సాయాన్ని తీసుకోనున్నారు.
  • ఈక్రమంలోనే  పలు ప్రాజెక్టులకు చంద్రబాబు సర్కారు శరవేగంగా భూములను కేటాయించింది.  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), టాటా పవర్, క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీల ప్రాజెక్ట్‌లను సగటున 60 రోజుల్లనే ఆమోదించింది.
  • పునరుత్పాదక ఇంధన విభాగంలో బెల్జియంకు చెందిన జాన్ కాకెరిల్ కంపెనీ రూ.71,400 కోట్లు విలువైన పెట్టుబడులు పెట్టనుంది.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏపీలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్‌లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఆ కంపెనీ దాదాపు రూ.65,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది.
  • టాటా పవర్ 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనుంది.
  • జాన్ కాకెరిల్, గ్రీన్‌కోతో జాయింట్ వెంచర్‌లో హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు.
  Last Updated: 20 Jan 2025, 03:30 PM IST