Site icon HashtagU Telugu

Republic Day 2023: ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

AP Repiblicday

Resizeimagesize (1280 X 720) (1)

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ బిశ్వభూషన్.. పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో అక్కడ ఏర్పాటు చేసిన పరేడ్‌ను పరిశీలించారు.

Also Read: Court Sentences Man To Death: ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. దోషికి ఉరిశిక్ష

రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ భిశ్వభూషన్ మాట్లాడుతూ.. కోవిడ్ సంక్షోభ సమయంలో నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఏపీలో సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక ఫలాలు అర్హులందరికీ అందుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని గవర్నర్‌ హరిచందన్‌ తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా 10 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని.. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు.