IAS Tranfers: ఏపీలో భారీగా కలెక్టర్ల బదిలీ

పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా అధికారుల మార్పిడి జరుగుతుంది. ఇటీవల కాలంలో గణనీయమైన సంఖ్యలో ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

IAS Tranfers: పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా అధికారుల మార్పిడి జరుగుతుంది. ఇటీవల కాలంలో గణనీయమైన సంఖ్యలో ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు .

కొత్త నియామకాల్లో శ్రీకాకుళం కొత్త కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్, పార్వతీపురం మన్యంలో శ్యామ్ ప్రసాద్, అనకాపల్లిలో కె.విజయ, అంబేద్కర్ కోనసీమలో రావిరాల మహేశ్‌కుమార్, కడపలో లోతేటి శివశంకర్, పల్నాడులో అరుణ్ బాబు, నెల్లూరులో ఓ.ఆనంద్ నియమితులయ్యారు. , తిరుపతిలో డి.వెంకటేశ్వర్లు, అన్నమయ్యలో చామకుర్రి శ్రీధర్ సత్యసాయి, నంద్యాలలో చేతన్, బి.రాజకుమారి, విశాఖలో హరేంద్రప్రసాద్ నియమితులయ్యారు.

కాగా ఈవిధమైన బదిలీ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల పాలనలో గణనీయమైన మార్పును తీసుకొచ్చాయి. కొత్త కలెక్టర్లకు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించనున్నారు.

Also Read: KTR : కేటీఆర్ సవాళ్లకు విలువ ఉందా..?