Site icon HashtagU Telugu

YSR Pension Kanuka: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక.. అవ్వా తాతలకు పండగ!

Ysr Pension

Ysr Pension

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ పండగలా కొనసాగుతోంది. ప్రభుత్వం 62.53 లక్షల మంది పెన్షనర్లకు రూ.1590.50 కోట్లు విడుదల చేసింది. తెల్లవారుజాము నుంచి వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు పంపిణీ అందజేస్తున్నారు. అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇంటి గడప దాటకుండానే పింఛన్లు అందుకుంటున్నారు.

నెలనెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా అయిదో తేదీలోగానే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తోంది. సెప్టెంబర్ నెలకు గానూ 62.53 లక్షల మందికి 1,590.50 కోట్లు పంపిణీ చేస్తోంది.

ఏడేళ్లలో సెప్టెంబర్లో పింఛన్ల పంపిణీకి ఖర్చు చేసిన మొత్తం

సెప్టెంబర్ 2022 ₹1,590.50 కోట్లు
సెప్టెంబర్ 2021 ₹1,397 కోట్లు
సెప్టెంబర్ 2020 ₹1,429 కోట్లు
సెప్టెంబర్ 2019 ₹1,235 కోట్లు
సెప్టెంబర్ 2018 ₹477 కోట్లు
సెప్టెంబర్ 2017 ₹418 కోట్లు
సెప్టెంబర్ 2016 ₹396 కోట్లు
సెప్టెంబర్ 2015 ₹405 కోట్లు

Exit mobile version