Site icon HashtagU Telugu

Ticket Rates: ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ఏపీ సర్కార్ గైడ్ లైన్స్?

Rg6ei3ph

Rg6ei3ph

ఏపీ సర్కార్ తాజాగా సినిమా టిక్కెట్ల అమ్మకాల పై కీలక ప్రకటన చేసింది. ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాలపై గైడ్ లైన్స్ ను జారీ చేసింది. అయితే ఇందుకోసం నోడల్ ఏజెన్సీగా ఏపిఎఫ్డిసి కి సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. అన్ని థియేటర్లు ప్రైవేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలి అని మార్గదర్శకాల్లో వెల్లడించింది ఏపీ ప్రభుత్వం. దీని ద్వారా ప్రతి టికెట్ పై రెండు శాతం సర్వీస్ ఛార్జ్ వసూలు చేయనున్నారు. థియేటర్లలో కూడా పక్కన ఆన్లైన్ టికెట్ అమ్మకాలు చేపట్టాలి అని సూచించింది. ఇందుకోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ థియేటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

కొత్త సినిమాలకు అయితే వారం ముందు నుంచే సినిమా టికెట్లు అమ్మాలి అని స్పష్టం చేసింది. అదేవిధంగా నెల రోజుల్లోనే అన్ని థియేటర్లలో కూడా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలని, ఒక వేళ నిబంధనలు పాటించని థియేటర్లలో లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది ఏపీ ప్రభుత్వం. అదే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమలయ్యే విధంగా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకువస్తామని మాజీ మంత్రి పేర్ని నాని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రజలకు మేలు చేసే విధంగా ఎవరు ఏ విన్నపం చేసినా కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కారు సానుకూలంగా స్పందిస్తుందని అని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి తాజా సమావేశంలో వారికి వివరించామని తెలిపారు . అదే విధంగా ప్రజలు ఎవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన రేట్లను అమలు చేస్తామని తెలిపారు.. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్ లో అమలు చేయాలని అందుకు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా వినోదాన్ని అందించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని తెలిపారు.