Site icon HashtagU Telugu

AP Lockdown: ఏపీ లో పాక్షిక లాక్ డౌన్

Template (65) Copy

Template (65) Copy

ఏపి లో పాక్షిక లాక్ డౌన్ పెట్టబోతున్నారని రెండు రోజుల క్రితమే హాష్ ట్యాగ్ యూ చెప్పింది. పరిస్థితులను సమీక్షించిన సీఎం జగన్ ఆ మేరకు ధ్రువీకరించారు. కరోనా వ్యాప్తి వేగవంతం కావడంతో రాత్రి కర్ఫ్యూ ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని ప్రత్యేకమైన మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేశారు.

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూని విధించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అవసరమైన మందులను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖా కు సీఎం ఆదేశించారు. కరోనా బాధితులకు ఇచ్చే హోం క్వారంటైన్ లో మార్పులు చేయాలని కోరారు.

అన్ని నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాస్క్ పెట్టుకోని వారికి భారీ జరిమానా విధించాలని ఆదేశించారు. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా మాస్కులు ధరించాలని చెప్పారు.

కోవిడ్ నిబంధలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించేలా చూడాలని జగన్ చెప్పారు. 104 కాల్ సెంటర్ ను బలోపేతం చేయాలని సూచించారు. థియేటర్లలో 50 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. సీటు మార్చి సీటుకు అనుమతించాలని చెప్పారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి, ఇండోర్ కార్యక్రమాల్లో 100 మందికి మించి అనుమతించకూడదని ఆదేశించారు.

Exit mobile version