Mukesh Ambani: ముఖేష్ అంబానీ రాకతో కళగా మారిన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గ్రాండ్ గా ప్రారంభమైంది..

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ప్రారంభమైంది. సీఎం జగన్ సదస్సును ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఎడ్వాంటేజ్‌ ఏపీ నినాదంతో.. 14 రంగాల్లో ఈ Global Investors Summit ను నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు పరిమళ్‌ నత్వానీతో కలిసి దిగ్గజ పారిశ్రామిక వేత్త ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani) విశాఖకు చేరుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో జీఐఎస్‌ సమ్మిట్‌ ప్రాంగణానికి చేరుకున్న అంబానీకి.. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు అమర్‌నాథ్, విడదల రజిని, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖేష్‌ అంబానీకి (Mukesh Ambani) ఆత్మీయ స్వాగతం పలికారు.

ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్‌ కుమారమంగళం బిర్లా, టాటా గ్రూపు ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, జీఎంఆర్‌ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల ఈ సదస్సుకు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చర్చాగోష్ఠులు జరగనున్నాయి. వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు బీచ్‌రోడ్డులోని ఎంజీఎం మైదానంలో అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది.

Also Read:  Tarakaratna Love Letter: వైరల్ అవుతున్న తారకరత్న లవ్ లెటర్..