Site icon HashtagU Telugu

AP Rains:ఏపీలో 12శాతం అద‌న‌పు వ‌ర్ష‌పాతం

1016078 Dr

rain

ఏపీ రాష్ట్రంలో సాధారణం కంటే 12 శాతం అధికంగా జూన్ నెల‌లో వర్షం కురిసింది. ఆ మేరకు అమరావతి ఐఎండీ డైరెక్టర్‌ స్టెల్లా ఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 94.1మిల్లీమీటర్లకు గానూ 105.7మిల్లీమీటర్లు నమోదైందని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలో అత్యధికంగా 129.5మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 68మి.మీ. 90 శాతం అధికం. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 76.9మి.మీ. సాధారణం 123.8మి.మీ. 38 శాతం లోటు. మిగులు వర్షపాతం నమోదైన జిల్లాల్లో అనంతపురంలో 75 శాతం, చిత్తూరులో 59 శాతం, తూర్పు గోదావరిలో 44 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

సాధారణం కంటే గుంటూరులో 33 శాతం, ప్రకాశంలో 33 శాతం, శ్రీకాకుళంలో 28 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో సాధారణ వర్షపాతం 141.7మి.మీ కాగా 1233.9మి.మీ. లోటు 13 శాతంగా ఉంది. ఇదిలావుండగా, ఉత్తర ఒడిశాలో బంగాళాఖాతంలో జూలై 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అల్పపీడన ద్రోణిగా మధ్యప్రదేశ్ మీదుగా బలహీనపడే అవకాశం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Exit mobile version