ఏపీ ఆర్థికంపై ఎవ‌రిది నిజం? భేష్ అంటోన్న బుగ్గ‌న లెక్క‌లు

  • Written By:
  • Publish Date - September 18, 2021 / 04:18 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా? అభివృద్ది రేటు త‌గ్గిందా? జ‌గ‌న్ ఇక ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌లేడా? రాష్ట్రాన్ని వైసీపీ దివాళ తీయించిందా? అంటే..ఔను అని టీడీపీ అంటోంది. కానీ, వాస్త‌వాలు వేర‌ని వైసీపీ చెబుతోంది. ఏది నిజ‌మో సామాన్యుల‌కు అంతుచిక్క‌డంలేదు. క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప‌నిలోప‌నిగా మాజీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌క్రిష్ణుడు ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడ‌ని చుర‌క‌లంటించాడు.


ఏపీ ఆర్థిక ప‌రిస్థితి బ‌గ్గ‌న చెప్పిన దాని ప్ర‌కారం టీడీపీ హ‌యాం కంటే మెరుగ్గా ఉంది. సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి ఏడాది అంటే 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో 7.23 జీఎస్డీపీ ఉంది. వ్య‌వ‌సాయ రంగంలో 7.23 పారిశ్రామిక అభివృద్ది 10.24, సేవ‌ల రంగంలో 6.20శాతం అభివృద్ధి ఉంద‌ని బుగ్గ‌న డేటా విడుద‌ల చేశారు.
ఎస్డీజీఎస్ ఇండిక్స్ లో 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏపీ మూడో స్థానంలో ఉంద‌ని, అదే 2018-19లో నాలుగో స్థానంలో ఉంద‌ని చంద్ర‌బాబు హ‌యాంను గుర్తు చేశారు. అస‌మాన‌తలుత తొల‌గించ‌డంలో ఏపీ 5వ స్థానం పేద‌రిక‌నిర్మూల‌న‌లో 6వ స్థానంలో ఉంద‌ని నీతి ఆయోగ్ విడుద‌ల చేసిన ర్యాంకింగ్ ల‌ను బుగ్గ‌న ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతంఎస్డీజీఎస్ ఇండెక్స్ లో ముందు వ‌రుస‌లో ఉన్నామ‌ని వెల్ల‌డించారు.
క‌రోనా టైంలో కూడా ఆర్థిక ప‌రిస్థితిని మెరుగుప‌రిచామ‌ని వైసీపీ స‌ర్కార్ భావిస్తోంది. ఇంకో వైపు జీతాలు ఇవ్వ‌డానికి నిధులు లేక‌పోవ‌డంతో ఆస్తుల‌ను అమ్మ‌కానికి పెట్టింది. చంద్ర‌బాబు హ‌యాంను పోల్చుకుంటూ ప్ర‌స్తుతం మెరుగ్గా ఉన్నామ‌ని జ‌బ్బ‌లు చ‌రుసుకుంటున్నారు వైసీపీ నేత‌లు. మ‌రి, అభివృద్ధి ఎక్క‌డ‌? అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మౌలిక స‌దుపాయాలు స‌మ‌కూరిన దాఖ‌లాలు లేవు. నిరుద్యోగ స‌మ‌స్య పెరిగింది. వ్య‌వ‌సాయం కుంటుప‌డుతుంది. ఓవ‌ర్ డ్రాఫ్ట్ కు వెళుతున్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే, య‌న‌మ‌ల చెప్పేది నిజ‌మా? బుగ్గ‌న అంకెలు క‌రెక్టా? అనేది సందిగ్ధం.

Follow us