కొత్త డ్రెస్ కోడ్ పై డాక్టర్ల ఆగ్రహం… తగ్గేదేలే అంటున్న ఆరోగ్యశాఖ

విజయవాడ వైద్య ఆరోగ్య శాఖ లో సోమవారం నుంచి కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వారికి కొత్త డ్రెస్ కోడ్ తో రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

  • Written By:
  • Publish Date - October 31, 2021 / 04:09 PM IST

విజయవాడ వైద్య ఆరోగ్య శాఖ లో సోమవారం నుంచి కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వారికి కొత్త డ్రెస్ కోడ్ తో రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే దీనిపై మహిళా వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో పనిచేసే సిబ్బంది అందరూ విధులకు హాజరవుతున్నప్పుడు డ్రెస్ కోడ్ పాటించాలని ఇటీవల ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు.

దీని ప్రకారంమహిళా వైద్యులు స్టెతస్కోప్తో కూడిన ఫుల్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్లు, ముదురు నీలం రంగు ట్యాగ్తో కూడిన గుర్తింపు కార్డు, పేరు, హోదా మరియు ఐడి నంబర్తో కూడిన బ్యాడ్జ్ ధరించాలని కోరారు. పురుష వైద్యులు స్టెతస్కోప్తో ఫుల్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్లు ధరించాలని…ముదురు నీలం రంగు ట్యాగ్, బ్యాడ్జ్తో కూడిన ID కార్డ్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని సర్య్కూలర్లో పేర్కోంది. ఇదే కాక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం నుంచి బయోమెట్రిక్ హాజరును ఆరోగ్యశాఖ అధికారులు అమలు చేస్తున్నారు.

విధుల్లో ఉన్నప్పుడు తాము ఫుల్ స్లీవ్ వైట్ ఆప్రాన్ ధరిస్తున్నామని ఇప్పుడు కొత్తగా శారీ,పంజాబీ డ్రెస్లపై కూడా కలర్ కో్డ్ విధించడం అన్యాయమని ఓ మహిళా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు.మాట్లాడుతూ డ్రెస్ కోడ్ అమలుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.హెడ్ నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బందికి తెల్లటి టోపీ, రెడ్ స్ట్రిప్ ఐడి కార్డ్తో హాఫ్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్ ధరించాలనే డ్రెస్ కోడ్ను కూడా నిర్ధేశించారు. స్టాఫ్ నర్సులు ID కార్డ్ , కలర్ ట్యాగ్తో హాఫ్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్ ధరించాలని…ఫార్మసిస్ట్లు ID కార్డ్ , స్కై బ్లూ కలర్ ట్యాగ్తో హాఫ్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్ ధరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు ID కార్డ్, వైలెట్ కలర్ ట్యాగ్తో వైట్ కలర్ ఆప్రాన్ ధరించాలని తెలిపింది.