Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ ని లెక్క చేయని వైసీపీ…

ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి విజయం సాదిస్తుందని తేల్చాయి. వైసీపీగట్టి పోటీ ఇస్తుందని, అంతిమంగా విజయం ఎన్డీయే కూటమిదేనని స్పష్టం చేసింది. కానీ విజయంపై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మీడియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విజయం వైసీపీదేనంటూ బడా నేతలు చెప్తుండటం విశేషం.

Exit Polls 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. జూన్ 4, మధ్యాహ్నం నాటికీ ఏపీ ముఖ్యమంత్రి ఎవరనేది తేలనుంది. తాజాగా ఎగ్జిట్ పోల్స్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి విజయం సాదిస్తుందని తేల్చాయి. వైసీపీగట్టి పోటీ ఇస్తుందని, అంతిమంగా విజయం ఎన్డీయే కూటమిదేనని స్పష్టం చేసింది. కానీ విజయంపై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మీడియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విజయం వైసీపీదేనంటూ బడా నేతలు చెప్తుండటం విశేషం.

నెల్లూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎంపీ సీటును తమ పార్టీ కైవసం చేసుకుంటుందని వైఎస్సార్‌సీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. తాను అనేక బూత్‌లను సందర్శించినప్పుడు ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఓటు వేయడాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్లు, నెల్లూరు ఎంపీ సీటులో టీడీపీ గెలిచే అవకాశం లేదని, ఇప్పటికే ఓటర్లు అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు వేశారని ఇది తప్పుడు ప్రచారమని ఆయన అన్నారు.

కౌంటింగ్ డ్యూటీలో ఉన్న ఏజెంట్లు చాలా అప్రమత్తంగా ఉండాలని, ప్రక్రియ పూర్తయ్యే వరకు కౌంటింగ్ కేంద్రంలో ఉండాలని, పోస్టల్ బ్యాలెట్‌తో సహా ప్రతి ఓటును నిశితంగా గమనించాలని విజయసాయి రెడ్డి హెచ్చరించారు. కౌంటింగ్‌లో ఏమైనా తప్పులుంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.

Also Read: Nitheesha Kandula : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని మిస్సింగ్