AP Results 2024: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీకి కంచు కోటగా మారిన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి సీఎం జగన్ విజయంపై వైసీపీ ధీమాగా ఉంది. అయితే ఇదే కడప లోక్ సభ స్థానం ఉంచి పోటీకి దిగిన సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కౌంటింగ్ లో వెనుకబడ్డారు.
1978 నుంచి పులివెందులలో వైఎస్ కుటుంబీకులే గెలుస్తున్నారు. 1978, 1983, 1985ల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. 1999, 2004, 2009ల్లోనూ వైఎస్ఆర్ రెండోసారి హ్యాట్రిక్ విజయం సాధించారు. కాగా 2004 ఎన్నికల్లో 40 వేలకుపైగా మెజార్టీతో పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన వైఎస్.. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత అదే స్థానం నుంచి వైఎస్ జగన్ పోటీ చేసి గెలుస్తున్నారు.
Also Read: AP Results 2024: గుడివాడలో కొడాలి నాని గెలుపు ఖాయమేనా? మరికాసేపట్లో తేలనున్న కొడాలి భవితవ్యం