AP Elections 2024: ప్రస్తుతం ఏపీలో ఎన్నికల జోరు కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా, అధికార పార్టీ వైఎస్సాఆర్‌సీపీ ఒంటరిగానే పోరుకి సిద్దమైంది. ఈ నేపథ్యంలో మద్యం ఏరులై పారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఈసీ ఫోకస్ చేసింది.
రానున్న ఎన్నికల్లో మద్యం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. గత ఏడాది ఇదే నెల విక్రయాల గణాంకాల ఆధారంగా ప్రభుత్వ రిటైల్ షాపుల్లో విక్రయించే మద్యంపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. రాజకీయ లబ్ధి కోసం మద్యం దుర్వినియోగం కాకుండా ఎక్సైజ్ అధికారులు ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం సరఫరాను నిశితంగా పరిశీలిస్తున్నారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మద్యం, బీరుకు డిమాండ్ పెరుగుతుండటంతో మద్యం విక్రయాలు, పంపిణీలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే మద్యంపై ఆంక్షలు విధిస్తుండడంతో మద్యం ప్రియులకు నిరాశే ఎదురవుతోంది. ఎన్నికల సమయంలో పారదర్శకంగా ఉండేలా మద్యం నిల్వల తొలగింపు, విక్రయాలపై రోజువారీ నివేదికలు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా వివిధ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తుండడంతో ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా మద్యం విక్రయాలపై ఆంక్షలను నిశితంగా పరిశీలిస్తున్నారు. మద్యం దుకాణాలపై ఆంక్షల ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ క్లిష్ట సమయంలో శాంతిభద్రతలను నిర్వహించడానికి కఠిన చర్యలు తీసుకోక తప్పదనిపేర్కొంది ఏపీ ఎన్నికల సంఘం.
Also Read: Revanth Reddy : ఢిల్లీకి పయనమైన సీఎం రేవంత్ రెడ్డి