Kakinada JNTU : కాకినాడ జేఎన్టీయూలో ‘మ‌తం’ ర‌భ‌స‌

కాకినాడ జేఎన్టీయూ కేంద్రంగా మ‌త వివాదం చోటుచేసుకుంది. యూనివ‌ర్సిటీలోని కొంత భాగాన్ని ఒక వ‌ర్గం ఆక్ర‌మించుకుని ప్రార్థ‌నా మందిరాన్ని క‌ట్టే ప్ర‌య‌త్నం చేసింది.

  • Written By:
  • Publish Date - April 30, 2022 / 09:00 PM IST

కాకినాడ జేఎన్టీయూ కేంద్రంగా మ‌త వివాదం చోటుచేసుకుంది. యూనివ‌ర్సిటీలోని కొంత భాగాన్ని ఒక వ‌ర్గం ఆక్ర‌మించుకుని ప్రార్థ‌నా మందిరాన్ని క‌ట్టే ప్ర‌య‌త్నం చేసింది. రంజాన్ సందర్భంగా ప్రార్థనల కోసం కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జెఎన్‌టియుకె) ఆవరణలోని మైదానాన్ని చదును చేయడంపై వివాదం చెలరేగింది.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వై.మాలకొండయ్య, కాకినాడ నగర పార్టీ సీనియర్‌ నాయకుడు దువ్వూరి సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. విద్యాసంస్థకు చెందిన భూమిని మతపరమైన అవసరాలకు వినియోగించరాదని, లెవలింగ్‌ను నిలిపివేసే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో యూనివ‌ర్సిటీ కేంద్రంగా బీజేపీ క్యాడ‌ర్‌, ముస్లింల మ‌ధ్య వివాదం నెల‌కొంది.

యూనివర్శిటీ భూమిలో కొంత భాగాన్ని చాలా కాలం క్రితం ఆక్ర‌మ‌ణ‌కు గురైయింద‌ని ఏపీ యూనివర్సిటీల ఛాన్సలర్‌గా ఉన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు బీజేపీ లేఖ రాసింది. భవిష్యత్తులో విశ్వవిద్యాలయం విస్తరణ దృష్ట్యా గవర్నర్ వెంటనే నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్యం కోరారు. యూనివర్శిటీ స్థలంలో ప్రార్థనలు చేసేందుకు ఫెన్సింగ్ లేదా గోడను ఏర్పాటు చేయాలని కొంతమంది వ్యక్తులు తనను సంప్రదించారని JNTUK వైస్ ఛాన్సలర్ ప్రొ.జి.వి.ఆర్. ప్ర‌సాద‌ రాజు చెబుతున్నారు. ఈ స్థలానికి సంబంధించి కోర్టులో కేసు ఉండ‌డంతో అనుమతి నిరాకరించారు. రంజాన్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించు కోసం పొదలను తొలగించడానికి , నేలను చదును చేయడానికి అనుమతించారు.

సైట్‌పై ఎలాంటి వివాదం లేదని MEWA ఇన్‌ఛార్జ్ దీన్ చెబుతున్నారు. దశాబ్దాల క్రితం, గుజరాత్‌కు చెందిన నూర్ సేథ్ అనే దాత ప్రార్థనల కోసం ఆరు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చార‌ని వివ‌రించారు. AP వక్ఫ్ బోర్డు నోటిఫై చేసిందని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఈ ప్రదేశంలో రంజాన్ ప్రార్థనలు కొనసాగుతున్నాయి. రంజాన్ మరియు బక్రీద్ సందర్భంగా ఈ ప్రదేశంలో ప్రార్థనలు చేసేవారని దీన్ గుర్తు చేసుకున్నారు. బీజేపీ క్యాడ‌ర్ మాత్రం యూనివ‌ర్సిటీ ఆవ‌ర‌ణ‌లో ప్రార్థ‌న‌లు చేయ‌డానికి లేద‌ని వార్నింగ్ ఇచ్చింది. దీంతో కాకినాడ యూనివ‌ర్సిటీ కేంద్రంగా ఉద్రిక్త‌త నెలకొంది.