Fishing Harbour : 60వేల ఉద్యోగాల‌కు జ‌గ‌న్ ప్లాన్

ఓడ‌రేవుల రూపంలో ఒకేసారి 60వేల మందికి ఉపాథి క‌ల్పించ‌డానికి జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు.

  • Written By:
  • Updated On - March 1, 2022 / 04:27 PM IST

ఓడ‌రేవుల రూపంలో ఒకేసారి 60వేల మందికి ఉపాథి క‌ల్పించ‌డానికి జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు. నాలుగు ఓడ‌రేవులు వ‌చ్చే ఏడాది పూర్తి చేయడానికి ప్ర‌ణాళిక‌ను ర‌చించాడు. శ‌ర‌వేగంగా వాటి నిర్మానం జ‌రుగుతోంది.ఏపీ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన వ‌న‌రులు ఎక్కువ‌గా ఉన్నాయి. వాటిని స‌ద్వినియోగం చేసుకుంటే మ‌రో సింగ‌పూర్ అవుతుంద‌ని రాష్ట్ర విభ‌జ‌న సందర్భంగా మేధావులు భావించారు. ప్ర‌ధానంగా కోస్ట‌ల్ కారిడార్ ఏపీకి మ‌ణిహారంగా ఉంది. నెల్లూరు నుంచి విశాఖ వ‌ర‌కు విస్త‌రించి ఉన్న స‌ముద్ర తీరం వెంబ‌డి ఓడ‌రేవుల‌ను నిర్మించ‌డం ద్వారా ఎగుమ‌తులు, దిగుమ‌తుల‌కు కేంద్రంగా ఏపీ మారే అకాశం ఉంది. ఫ‌లితంగా రాష్ట్రం ఆదాయం కూడా పెరుగుతోంది. కానీ, దిశ‌గా స‌ర్కార్ అడుగులు వేయ‌డంలేద‌ని చాలా కాలంగా వినిపిస్తోన్న విమ‌ర్శ‌లు. కానీ, వాస్త‌వ ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయ‌ని అధికారులు చెబుతున్నారు. శ‌ర‌వేగంగా ఓడ‌రేవుల నిర్మాణం జ‌రుగుతోంది. వాటి వివ‌రాల‌ను తాజాగా అధికారులు అందించారు.
దేశ చరిత్రలో తొలిసారిగా రూ.3,622.86 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్‌లను నిర్మిస్తున్నారు. తొలుత రూ.1,204.56 కోట్లతో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. నెల్లూరు జిల్లాలోని శ్రీ పొట్టి శ్రీరాములు జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడల్లో ఎంఆర్‌కేఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ వీటిని నిర్మిస్తున్నాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి రాష్ట్రంలో జ‌రుగుతోన్న ఓడ‌రేవుల అభివృద్ధి గురించి వెల్ల‌డించాడు. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నాలుగు ఫిషింగ్ హార్బర్‌లలో డ్రెడ్జింగ్ ప్రక్రియ పూర్తయిందని, అదనంగా మూడు మిలియన్ టన్నుల మత్స్య సంపద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ హార్బర్‌లు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో నేరుగా 60 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. 10,000 మెకనైజ్డ్ బోట్లను పట్టుకోగల సామర్థ్యం కూడా ఉంది. రెండో దశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో హార్బర్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు వరుసగా రూ.1,496.85 కోట్లతో టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే.సో..ఇవ‌న్నీ అనుకున్న టైంకు పూర్తి అయితే ఏపీకి మ‌హ‌ర్ధ‌శ ప‌ట్టిన‌ట్టే.!