Site icon HashtagU Telugu

AP Congress : ఏపీలో న‌వ `సంక‌ల్ప చింత‌న్‌`

Tulasi Reddy

Tulasi Reddy

ఏపీ కాంగ్రెస్ ను బ‌తికించుకోవ‌డానికి ఆ పార్టీ స‌రికొత్త ప్రోగ్రామ్ ను పెడుతోంది. వ‌చ్చే నెల 4, 5 తేదీల్లో కడపలోని ఇందిరా భవన్ లో రాష్ట్ర స్థాయి “నవ సంకల్ప చింతన్” సదస్సు నిర్వ‌హించ‌నుంది. ఆ మేర‌కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వెల్లడించారు. సంస్థాగత, రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ, సామాజిక సాధికారత, యువత అంశాలపై చర్చించి డిక్ల‌రేష‌న్ ను ప్ర‌క‌టిస్తుంద‌ని అన్నారు. తెలంగాణలోని వ‌రంగ‌ల్ డిక్లరేష‌న్ మాదిరిగా ఏపీలో కడప డిక్లరేషన్ ప్రకటించ‌డానికి సిద్ధం అవుతోంది.
క్విట్ దుష్ట చతుష్టయం (బిజెపి, వైకాపా, టిడిపి, జనసేన), సేవ్ ఆంధ్రప్రదేశ్ ఈ సదస్సు ప్రధాన లక్ష్యం అని తులసిరెడ్డి పేర్కొన్నారు. జగన్ మూడేళ్ల పాలనలో అప్పులు ఫుల్ – అభివృద్ధి నిల్ – సంక్షోభంలో సంక్షేమం నిలిచిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్లు అని, ఇందులో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.5 లక్షల కోట్లు అని తెలిపారు. శ్రీలంక ఆర్థిక పరిస్థితి కంటే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళ‌న చెందారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని వ్యాఖ్యానించారు. అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలడం లేదు అంటూ వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు.