Site icon HashtagU Telugu

YS Sharmila : విజయవాడలో ఇల్లు కొన్న షర్మిల.. ఎందుకో తెలుసా ?

Ys Sharmila House In Vijayawada Andhra Pradesh Congress Chief

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విజయవాడలో ఇంటిని కొన్నారు. విజయవాడ నగరంలోని పోరంకి రోడ్‌లో ఉన్న కామినేని హాస్పిటల్ సమీపంలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న డ్యూప్లెక్స్ విల్లాను ఆమె కొన్నారు. సెక్యూరిటీపరంగా ఇబ్బంది కలగకుండా ఉండేలా ఈ ఇంటిని షర్మిల ఎంపిక చేసుకున్నారట.  దాదాపు రూ.8 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని కొన్నారట. త్వరలోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆమె మకాం మారుస్తారని తెలుస్తోంది. ఇకపై విజయవాడలోనే ఉంటూ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలను షర్మిల చక్కబెట్టనున్నారు. పార్టీ ముఖ్యలతో ఈ నివాసంలోనే ఆమె భేటీ కానున్నారు.

Also Read :Hijab Song: హిజాబ్‌పై సాంగ్.. సింగర్‌కు 74 కొరడా దెబ్బలు

లోలోపల విమర్శలు

షర్మిల విజయవాడలో అందుబాటులో ఉండటం లేదని పలువురు కాంగ్రెస్ నేతలు లోలోపల విమర్శించారట. స్థానికంగా అందుబాటులో ఉంటే పార్టీ క్యాడర్‌తో సమన్వయం ఈజీ అవుతుందని షర్మిలకు ఇంకొందరు నేతలు సూచనలు ఇచ్చారట. వారి సూచనలను సానుకూల కోణంలో షర్మిల(YS Sharmila) పరిగణనలోకి తీసుకున్నారు. భేషజాలకు పోలేదు. అందుకే రూ.8 కోట్లు ఖర్చుపెట్టి మరీ ఇల్లును కొనేశారు. ఏపీలో క్షేత్రస్థాయిలో  హస్తం పార్టీని బలోపేతం చేయడంపై ఆమె పూర్తిస్థాయిలో ఫోకస్ చేయబోతున్నారు. అంతేకాదు.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, విమర్శించేందుకూ షర్మిల రెడీ అవుతున్నారు. బీజేపీతో టీడీపీ దోస్తీని ప్రశ్నించాలని ఆమె భావిస్తున్నారు.

Also Read :Congress : ఎమ్మెల్సీ పోల్స్‌లో కాంగ్రెస్ పరాభవానికి ముఖ్య కారణాలివే..

వైసీపీ నుంచి వలసలకు స్కెచ్

వైఎస్సార్ సీపీ నుంచి చాలామంది నేతలు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆసక్తి ఉన్న వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపే ప్రణాళికను తదుపరిగా షర్మిల అమలు చేయబోతున్నారట. ఆమె మొదటి ఫోకస్ రాయలసీమ ప్రాంతంపైనే ఉండబోతోందట.  కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నేతలు ఇప్పటికే షర్మిలతో టచ్‌లోకి వచ్చారట. ఇప్పటికే వైసీపీ నేతలు జనసేన, టీడీపీ, బీజేపీల్లో చేరుతున్నారు. ఇక కాంగ్రెస్‌లోకి కూడా చేరికలు మొదలైతే.. ఫ్యాను పార్టీకి ప్రతికూల సమయం మొదలైనట్టే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.