CM Jagan to Start Bus Yatra in AP : రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర..

ఈ సందర్బంగా అక్టోబర్ 25 నుండి 31తారీకు వరకు బస్సుయాత్ర (Jagan Bus Yatra) చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

  • Written By:
  • Updated On - October 9, 2023 / 01:14 PM IST

ఏపీలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ (Jagan) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మరో నాల్గు , ఐదు నెలల్లో ఎన్నికలు (2024 AP Assembly Elections) రాబోతుండడంతో ఆ నాల్గు నెలలు ప్రజల మధ్య ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణు­లను సమాయత్తం చేసేందుకు జగన్ (Jagan) సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా సోమ­వారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సి­పల్‌ స్టేడియంలో పార్టీ విస్తృత స్థాయి సమా­వేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మె­ల్సీ­లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌­చార్జ్‌లు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు 8 వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా అక్టోబర్ 25 నుండి 31తారీకు వరకు బస్సుయాత్ర (Jagan Bus Yatra) చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయని…ఆ లోపల నాలుగు కీలక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాలను ప్రకటించింది. ఈ నిర్ణయాలను జగన్ సమావేశంలో ప్రకటించారు. వైసీపీ పార్టీ ఇచ్చినట్లు రాష్ట్రంలో ఏ పార్టీ సంక్షేమ పధకాలు అందజేయలేదని ఈ సందర్బంగా జగన్ అన్నారు. ఇప్పటి వరకు చాలా అడుగులు వేసామని అయితే రాబోయే రోజులు మరింత కీలకమని, ఎలక్షన్స్ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జగన్ సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించి.. ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళ్లాలంటే మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాలని జగన్ సూచించారు. ఇందుకు ‘రాష్ట్రానికి జగనే కావాలి’ (వై ఏపీ నీడ్స్‌ జగన్‌) కార్యక్రమాన్ని చేపట్టాల్సిన తీరుపై ప్రతినిధులకు మార్గ నిర్దేశం చేసారు.

జగనన్న ఆరోగ్య సురక్ష ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని జగన్ పిలుపునిచ్చారు. దీని ద్వారా రాష్ట్రంలో ఏ ఒక్కరు అనారోగ్య సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. వ్యాధులు రాకముందే ప్రజలను అప్రమత్తం చేయడం, తగిన మందులు ఇవ్వడం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు. 5 దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపడతామని తెలిపారు.

Read Also : Hyderabad Drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత..రాజమండ్రికి చెందిన వ్యక్తులు అరెస్ట్