Site icon HashtagU Telugu

Ukraine Indians : ఉక్రెయిన్లోని విద్యార్థుల కోసం జ‌గ‌న్ లేఖ‌

Ys Jagan66

Ys Jagan66

ఉక్రెయిన్ లోని ఏపీ విద్యార్థులను సుర‌క్షితంగా తీసుకురావాల‌ని కోరుతూ భార‌త విదేశాంగ మంత్రిత్వ‌శాఖ‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ లేఖ రాశాడు. ఏపీలోని ఉన్న‌తాధికారులు, ఢిల్లీ ఏపీ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ ఎప్ప‌టిప్పుడు విదేశాంగ‌శాఖ‌కు అందుబాటులో ఉంటార‌ని తెలిపాడు. అస‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని లేఖ‌లో పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఉక్రెయిన్‌, ర‌ష్యా మ‌ధ్య నెల‌కొన్ని యుద్ధం కార‌ణంగా ఏపీ విద్యార్థుల‌కు స‌హాయ‌స‌హ‌కారాలు అందించ‌డానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని భ‌రోసా ఇచ్చాడు.విదేశాంగ‌శాఖ, ఇండియ‌న్ ఎంబ‌సీతో ఏపీ ఉన్న‌తాధికారులు ట‌చ్ లో ఉంటార‌ని లేఖ‌లో జ‌గ‌న్ పేర్కొన్నాడు. కేంద్రం, రాష్ట్రం స‌మ‌న్వ‌యంతో విద్యార్థుల‌ను తిరిగి తీసుకురావాల‌ని కోరాడు. ఇప్ప‌టికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విద్యార్థుల‌ను తీసుకురావ‌డానికి ఉక్రెయిన్ వెళ్లిన విష‌యాన్ని గుర్తు చేశాడు. అంతేకాదు, మూడు విమానాల ద్వారా ఎయిర్ ఇండియా విద్యార్థుల‌ను తీసుకు రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న విష‌యాన్ని ప్ర‌స్తావించాడు. కానీ, ఉక్రెయిన్ గ‌గ‌న‌త‌లాన్ని మూసివేయ‌డంతో ఎయిర్ ఇండియా విమానం వెనుతిరిగింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో తెలుగు విద్యార్థుల‌ను సుర‌క్షితంగా తీసుకురావ‌డానికి అన్ని ర‌కాలుగా ఏపీ ప్ర‌భుత్వం స‌హాయ‌స‌హ‌కారాల అందించ‌డానికి సిద్ధంగా ఉంద‌ని విదేశాంగ‌శాఖ‌కు జ‌గ‌న్ లేఖ రాశాడు. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది విద్యార్థులు ఉక్రెయిన్ కు ఉన్న‌త చ‌దువుల కోసం వెళ్లారు. అక్క‌డ చ‌దువుతోన్న విద్యార్థుల్లో 30శాతం మంది ఇండియ‌న్స్ ఉంటార‌ని అంచ‌నా. వాళ్లలో అత్య‌ధికంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన విద్యార్థుల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌త్యేకించి ఎంబీబీఎస్ చ‌దువు కోసం వెళ్లిన విద్యార్థులు ఎక్కువ‌గా ఉన్నారు. వాళ్ల‌ను సుర‌క్షితంగా దేశానికి తీసుకురావాల‌ని భార‌త విదేశాంగ‌శాఖ‌ను, భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని ఏపీ సీఎం జ‌గ‌న్ కోరాడు. ఆ మేర‌కు లేఖ రాయ‌డంతో పాటు ఏపీ ఉన్న‌తాధికారుల స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలిపాడు.