Anakapalle Blast: అనకాపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్మాగారంలోని రియాక్టర్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పలువురు గాయపడ్డారు

Published By: HashtagU Telugu Desk
Anakapalle Blast

Anakapalle Blast

Anakapalle Blast: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లాలోని ఓ కెమికల్ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.  ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్మాగారంలోని రియాక్టర్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానిక ఎస్పీ మాట్లాడుతూ.. అచ్యుతాపురం సెజ్‌లోని ఓ కంపెనీలో రియాక్టర్ పేలుడు సంభవించిందని, అయితే ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా,  50 మంది గాయపడ్డారని అనకాపల్లి ఎస్పీ దీపిక తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

అనకాపల్లి జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి స్పందించారు. పేలుడు స్థలాన్ని సందర్శించి గాయపడిన కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీని ఆదేశించారు.

Also Read: Toddler Bites Snake: పాముని నోట్లోకి తీసుకుని నమిలిన ఏడాది పాప

  Last Updated: 21 Aug 2024, 05:46 PM IST