Andhra Pradesh Cabinet 2.0 Swearing-in: ముద్దులు, పాదాభివంద‌నాల‌తో ప్ర‌మాణ‌స్వీకారం

ఆనందోత్సాహాల న‌డుమ ఏపీ మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారం జ‌రిగింది. పాత, కొత్త క‌ల‌యిక‌తో ఏర్పడిన మంత్రివ‌ర్గంలోని మంత్రులు ఆంగ్ల భాష అక్షరమాలను అనుసరించి ప్రమాణ స్వీకారం చేశారు.

  • Written By:
  • Publish Date - April 11, 2022 / 12:53 PM IST

ఆనందోత్సాహాల న‌డుమ ఏపీ మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారం జ‌రిగింది. పాత, కొత్త క‌ల‌యిక‌తో ఏర్పడిన మంత్రివ‌ర్గంలోని మంత్రులు ఆంగ్ల భాష అక్షరమాలను అనుసరించి ప్రమాణ స్వీకారం చేశారు. ప్ర‌మాణ‌స్వీకారం అనంతరం కొత్త‌గా మంత్రులైన వాళ్లు చాలా మంది జ‌గ‌న్ కాళ్లు మొక్కారు. అల్లా సాక్షిగా అంటూ తెలుగులో ప్రమాణం చేసిన అంజాద్ బాషా ముస్లిం మైనార్టీల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆంగ్లంలో ప్రమాణం చేసిన ఆదిమూలపు సురేష్ రెండోసారి మంత్రిగా ప్ర‌మాణం చేశారు. దైవ‌సాక్షిగా అంటూ ప్రమాణం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ సీనియ‌ర్ మంత్రిగా ఆక‌ట్టుకున్నారు. దైవ‌ సాక్షిగా అంటూ ప్రమాణం చేసిన బూడి ముత్యాల నాయుడు ప్రమాణం అనంతరం సీఎంకు జ‌గ‌న్ కు పాదాభివంద‌నం చేశారు. దైవసాక్షిగా అంటూ మంత్రిగా ప్రమాణం చేసిన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి రెండోసారి మంత్రి అయ్యారు. దైవ‌సాక్షి గా అంటూ ప్రమాణం చేసిన చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కూడా రెండోసారి మంత్రి అయ్యారు. రికార్డ్‌ల‌ ప్రకారం దాడిశెట్టి రామ లింగేశ్వర రావుగా పిలచిన సాధారణ పరిపాలన శాఖ ( రాజా) అని ప్రమాణం చేశారు. దైవసాక్షిగా అని ప్రమాణం చేసిన ధర్మాన ప్రసాదరావు సీనియ‌ర్ గా మంత్రివ‌ర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలిసారి మంత్రిగా అంబటి రాంబాబు ప్రమాణస్వీకారం చేశారు.

మంత్రిగా రోజా, విడ‌ద‌ల ర‌జిని ప్ర‌మాణ‌స్వీకార వేదిక‌పై వ‌చ్చిన స‌మ‌యంలో కేరింత‌లు వినిపించాయి. ప్ర‌మాణ స్వీకారం త‌రువాత సీఎం జ‌గ‌న్ చేతిని రోజా ముద్దాడ‌డం ప‌లువుర్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక విడ‌ద‌ల ర‌జిని ప్ర‌మాణ స్వీకారం త‌రువా జ‌గ‌న్ వ‌ద్ద ఆశీర్వాదం తీసుకున్నారు.కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంసచివాలయం పక్కన పార్కింగ్‌ స్థలంలో జ‌రిగింది. వెలగపూడి సచివాలయంలో మంత్రుల ప్రమాణస్వీకారం స‌రిగ్గా ముహూర్తం ప్ర‌కారం ఉదయం 11.31 గంటలకు ప్రారంభం అయింది. బొత్స, రాజన్నదొర , ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు , దాడిశెట్టి రాజా, పినిపె విశ్వరూప్‌, వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేశ్‌, అంబటి రాంబాబు , విడదల రజని, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేశ్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్‌, పెద్దిరెడ్డి, రోజా, నారాయణస్వామి, ఉషశ్రీ చరణ్ ఇంగ్లీషు అక్ష‌ర‌మాల ప్ర‌కారం వ‌ర‌సగా ప్ర‌మాణం చేశారు. మొత్తం 25 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గంలోని మంత్రుల‌కు సీఎం సూచనతో శాఖలు కేటాయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం దృష్ట్యా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయానికి వెళ్లే మార్గాల్లో ఆంక్షలు విధించిన పోలీసులు ప్రకాశం బ్యారేజీ ఆనుకుని ఉన్న కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు.
ప్రొటోకాల్ ప్ర‌కారం ప్ర‌మాణ స్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయ‌డంతో స‌వ్యంగా ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం ముగిసింది.