Site icon HashtagU Telugu

AP Interim Budget : రూ.2,86,389.27 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన బుగ్గన

Ap Interim Budget25

Ap Interim Budget25

అసెంబ్లీ లో ఏపీ సర్కార్ (AP Govt) మధ్యంతర బడ్జెట్‌ (Interim Budget)ని ప్రవేశ పెట్టింది. జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు సంబంధించి రూ.2,86,389.27 కోట్ల బడ్జెట్ ను మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది.. మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంధంగా భావిస్తారని బుగ్గన చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

బడ్జెట్ వివరాలు చుస్తే..

రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్.
రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు.
మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు.
ద్రవ్యలోటు రూ.55 వేల 817కోట్లు.
రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు.
జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం.
జీఎస్టీపీలో ద్రవ్యలోటు 3.51శాతం.

మరోపక్క సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నంద్యాల జిల్లా డోన్లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ (అన్నమాచార్య -రాజంపేట, గోదావరి-రాజమండ్రి, ఆదిత్య-కాకినాడ) యాక్ట్-2016 సవరణ ద్వారా బ్రౌన్ఫీల్డ్ కేటగిరీలో 3 ప్రైవేట్ వర్సిటీలకు ఆమోదం తెలిపింది.

Read Also : Israel Vs Gaza : ఇజ్రాయెలీ బందీలను వదలాలంటే.. ఆ ఒక్కదానికి ఒప్పుకోండి : హమాస్