Spirited promise: న‌వ్విపోదురుగాక‌.. మాకేంటి!

జాతీయ పార్టీల‌కు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉంటుంది. కానీ, బీజేపీ రాష్ట్రానికో పాల‌సీని ప్ర‌క‌టిస్తోంది. తాజాగా ఏపీలో చీప్ లిక్క‌ర్ పాల‌సీని వినిపిస్తోంది. కేవ‌లం 75 రూపాయ‌ల‌కు చీప్ లిక్క‌ర్ అందిస్తామ‌ని ఏపీ బీజేపీ ప్ర‌క‌టించ‌డం రాజ‌కీయాల దిగ‌జారుడుకు పరాకాష్ట‌.

  • Written By:
  • Publish Date - December 29, 2021 / 02:32 PM IST

జాతీయ పార్టీల‌కు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉంటుంది. కానీ, బీజేపీ రాష్ట్రానికో పాల‌సీని ప్ర‌క‌టిస్తోంది. తాజాగా ఏపీలో చీప్ లిక్క‌ర్ పాల‌సీని వినిపిస్తోంది. కేవ‌లం 75 రూపాయ‌ల‌కు చీప్ లిక్క‌ర్ అందిస్తామ‌ని ఏపీ బీజేపీ ప్ర‌క‌టించ‌డం రాజ‌కీయాల దిగ‌జారుడుకు పరాకాష్ట‌. అంతేకాదు, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డితే, 50 రూపాయ‌ల‌కే చీప్ లిక్క‌ర్ అందిస్తామ‌ని ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప్ర‌కటించ‌డం బీజేపీ నేల‌బారు రాజ‌కీయానికి నిద‌ర్శ‌నం.

బెయిల్ మీద ఉన్న నేత‌లు త్వ‌ర‌లో జైలుకు వెళ‌తార‌ని కేంద్ర మాజీ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌త్య‌ర్థులు జ‌గ‌న్ కు అన్వ‌యిస్తున్నారు. ప్ర‌జాగ్ర‌హ‌స‌భ‌కు హాజ‌రైన బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు, ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తారు. కానీ, కేసుల గురించి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్, చీప్ లిక్క‌ర్ పాల‌సీని వీర్రాజు ప్ర‌క‌టించ‌డం ప్ర‌జాగ్ర‌హ‌స‌భ‌ను న‌వ్వులపాలు చేసింది.
కొన్నేళ్లుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేసుల‌ను ఎదుర్కొంటున్నాడు. దాదాపు 16 నెల‌ల పాటు జైలు జీవితాన్ని గ‌డిపాడు. ఆయ‌న‌పై ఉన్న కేసులు కాంగ్రెస్ ఉద్దేశపూర్వ‌కంగా ఆపాదించ‌న‌వే. ఆ విషయాన్ని కాంగ్రెస్ ఢిల్లీ నేత‌లు గులాంన‌బీ ఆజాద్ , చిదంబరం ప‌లుమార్లు చెప్పారు. ల‌క్ష‌ల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని ఆనాడు టీడీపీ ఢిల్లీ కేంద్రంగా ప్ర‌చారం చేసింది. అందుకు సంబంధించిన చార్జిషీట్ల‌ను చెబుతూ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ 2019లో ఘోరంగా టీడీపీ ఓడిపోయింది. బెయిల్ మీద ఉన్న జ‌గ‌న్ ఏపీ సీఎంగా కొన‌సాగుతున్నాడు.

ప్ర‌స్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. జ‌గ‌న్ అవినీతిప‌రుడ‌ని కేంద్రం తేల్చాలి. బెయిల్ మీద ఉన్న నేత‌ల‌ను అరెస్ట్ చేసేలా సుప్రీం కూడా ముందుకు వ‌చ్చింది. కానీ, కేంద్రం అందుకు సంబంధించిన వ‌సతుల‌ను క‌ల్పించ‌లేక పోతోంది. పైగా జ‌గ‌న్ లాంటి రాజ‌కీయ వేత్త‌ల కేసుల‌ను విచారించ‌డానికి ప్ర‌త్యేక కోర్టుల అవ‌స‌రం దేశ వ్యాప్తంగా ఉంద‌ని సుప్రీం కోరిన‌ప్ప‌టికీ మౌలిక వ‌స‌తుల‌ను కేంద్రం క‌ల్పించ‌డంలేదు.
ఇదంతా ఒక ఎత్తైతే..ఇత‌ర పార్టీల్లోని అవినీతి ఆరోప‌ణ‌లున్న లీడ‌ర్ల‌ను బీజేపీ చేర్చుకుంటోంది. ప్ర‌త్యేకించి సుజ‌నా చౌద‌రిపై అవినీతి కేసులు విచార‌ణ‌లో ఉన్నాయి. ప‌లుమార్లు నాన్ బెయిల‌బుల్ వారెంట్ల‌ను ఆయ‌న అందుకున్నాడు. రాజ్య‌స‌భ స‌భ్యుడు ర‌మేష్ తో పాటు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన లీడ‌ర్లుపై అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తిరుప‌తి పార్ల‌మెంట్‌కు పోటీ చేసిన ర‌త్న‌ప్ర‌భ కూడా కేసుల‌ను ఎదుర్కొంటున్నారు. వీళ్లంతా విచార‌ణ నుంచి త‌ప్పించుకోవ‌డానికి బీజేపీలోకి వెళ్లార‌ని చాలా మంది భావిస్తుంటారు. గురివింద గింజ సామెత‌లా ప్ర‌జాగ్ర‌హ‌వేదిక‌పై కేంద్ర మాజీ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ ఇచ్చిన స్లోగ‌న్ ఉంది. ఆ వేదిక‌పై నుంచి జ‌వ‌దేక‌ర్‌, సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లతో ఏపీ బీజేపీ న‌వ్వులపాలు అయింద‌ని చెప్ప‌వ‌చ్చు.