Lance Naik Sai Teja: అమర జవాన్ కి అంతిమ వీడ్కోలు పలికిన ప్రజల

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా ఎగువ రేగడి గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికుల మధ్య ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

  • Written By:
  • Updated On - December 12, 2021 / 11:40 PM IST

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా ఎగువ రేగడి గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికుల మధ్య ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. మాతృభూమి సేవలో అమరుడైన సైనికుడు.. లాన్స్ నాయక్ సాయితేజ ఇంటి ముందు గత రెండు రోజులుగా జనం బారులు తీరుతున్నారు. అంతిమయాత్ర సమయంలో ఇసుక వేస్తే రాలనంత జనం సాయి తేజ ఇంటికి చేరుకున్నారు.

Lance Nayak Sai Teja funeral

సాయి తేజ ఇంటి వద్ద అతని ఫోటోలు పెట్టి పూలదండలు వేశారు. త్రివర్ణ పతాకాలతో పెద్ద ఎత్తున యువత అక్కడి చేకుని జై జవాన్… జోహార్ సాయి తేజ అంటూ నినాదాలు చేశారు. మరో వైపు ఆర్మీ ఉన్నతాధికారులు సాయి తేజ ఇంటికొచ్చి.. మీ సాయితేజ ఎంత గొప్పవాడో తెలుసా అని చెప్పినప్పుడు ఆ తండ్రి గుండె ఉప్పొంగింది. కానీ అంతలోనే సాయి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడని తెలిసి కన్నీరు పెట్టుకోవాలో.. దేశ సేవలో అమరుడయ్యాడని గర్వ పడలో ఆ తండ్రి కి అంతుపట్టలేదు.సాయితేజకు అంతిమ వీడ్కోలు పలికేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆర్మీ జవాన్లు గాలిలోకి మూడు రౌడ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. జోహార్ సాయితేజ అనే నినాదాలతో ఎగువరేగడి గ్రామం మార్మోగింది.

Lance nayak Sai teja funeral

సాయి తేజ పార్థీవదేహాన్నీ ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి ఏపీ సరిహద్దుల్లోకి తీసుకురాగా….అక్కడ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నడుమ సాయితేజ పార్థీమదేహం ఎగువ రేగడ గ్రామానికి చేరుకుంది. కర్ణాటక బార్డర్ నుంచి ఎగువ రేగడ గ్రామానికి వీరజ జవాన్ భౌతికకాయం చేరుకొనే వరకు దారి పొడవునా ప్రజలు సెల్యూట్ చేస్తూ అంబులెన్స్ పై పూలవర్షం కురిపించారు. జోహార్ సాయి తేజ అంటూ నినాదాలు చేసారు.మోటార్ సైకిల్ ర్యాలీలో సైతం 10 వేల మంది పైగా పాల్గొన్ని సాయితేజకు ఘనంగా నివాళులు అర్పించారు. ఇక స్వగ్రామం చేరుకున్న సాయితేజ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం కొంత సేపు ఉంచారు. దాదాపు 70 వేల మందికి పైగా ఎగువ రేగడ గ్రామానికి చేరుకొని సాయితేజ పార్థీమదేహానికి నివాళులు అర్పించారు.