Site icon HashtagU Telugu

Ban Vinyl Banners : ఏపీలో ఇక‌పై ఆ ఫ్లెక్సీలు నిషేధం – సీఎం జ‌గ‌న్‌

Cm Jagan

Cm Jagan

ప్లాస్టిక్‌ వ్యతిరేక చర్యలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వినైల్‌ బ్యానర్ల వినియోగాన్ని నిషేధించింది. పర్యావరణ పరిరక్షణకు క్లాత్‌ బ్యానర్లు వాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అమెరికాకు చెందిన పార్లీస్ ఫర్ ఓషన్స్ భాగస్వామ్యంతో భారీ బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చడమే త‌మ ప్రయత్నమ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. వి ఖర్చుతో కూడుకున్నప్పటికీ, పర్యావరణాన్ని కాపాడేందుకు క్లాత్‌ బ్యానర్లను ఉపయోగించాలని ఆయన సూచించారు.

ప్రజలు క్లాత్ బ్యాగుల వినియోగానికి మొగ్గు చూపడంతో ఆలయాల పట్టణమైన తిరుమల-తిరుపతిలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం సత్ఫలితాలను ఇస్తోందని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా కార్యాచరణ కార్యక్రమం కోసం పార్లేస్ ఫర్ ఓషన్స్, గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టెయినబుల్ ప్లానెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. పార్లీస్ ఫర్ ఓషన్స్ బీచ్ క్లీనింగ్ డ్రైవ్‌కు నాయకత్వం వహించింది. విశాఖపట్నం నుండి భీమిలి వరకు బంగాళాఖాతం వెంబడి 23 కిలోమీటర్ల విస్తీర్ణంలో 72 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేసింది.