Andhra Pradesh: వచ్చే ఏడాది 2024లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో లోక్‌సభ, విధానసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో నకిలీ ఓటర్ల వ్యవహారం ఊపందుకుంటోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తోందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇలా చేసి ఉంటే అది సరికాదని, అలా జరగకూడదని అన్నారు. ఓటరు జాబితా నుంచి కొందరు ఓటర్ల పేర్లను ఉద్దేశ్యపూర్వకంగా తొలగించినందుకే ఇద్దరు బీఎల్‌ఓలను రెండు నెలల క్రితం సస్పెండ్ చేసినట్లు మీనా తెలిపారు.
40 లక్షల మంది నకిలీ ఓటర్లు: టీడీపీ
ఆంధ్రప్రదేశ్ ఓటరు జాబితాలో ఇలాంటి తప్పులు నిరంతరం కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆరోపణను ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇప్పుడు అంగీకరించారు. మీనా మాట్లాడుతూ.. ఇందులో ప్రమేయం ఉన్న వారిని ఢిల్లీకి పిలిపించామని, ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సీఈవోను వివరణ కోరినట్లు చెబుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సుమారు 60 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని రాష్ట్ర ప్రస్తుత అధికార పార్టీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ ఆరోపించింది. అదే సమయంలో ప్రస్తుతం కూడా దాదాపు 40 లక్షల మంది నకిలీ ఓటర్లు ఓటరు జాబితాలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ టీడీపీ పేర్కొంది.
Also Read: ITR Filing: జూలై 27 నాటికి 5 కోట్ల మంది ఐటీఆర్‌లు దాఖలు.. మరో 72 గంటలు మాత్రమే ఛాన్స్..!
అధికార పార్టీని టీడీపీ తప్పుబట్టింది
ఓటరు జాబితాలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధికార పార్టీనే నేరుగా తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలను జాగ్రత్తగా పరిశీలిస్తే 2150 ఇళ్లకు కలిపి లక్షా 85 వేల మంది ఓటర్లు చేరారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏడు వింతలు మాత్రమే ఉండేవని, ఈ లెక్కన చూస్తే ఇది ఎనిమిదో అద్భుతమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఓటరు జాబితాలో ఇంత పెద్ద రిగ్గింగ్ జరిగాక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితాను అంత తేలిగ్గా మార్చడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. అదే సమయంలో ఈ అంశంపై భారత ఎన్నికల అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి.