Site icon HashtagU Telugu

AP BRS: వైసీపీ పాలనలో దగా పడ్డ ఆంధ్ర ప్రజానీకం: బిఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట

Brs Ap

Brs Ap

ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మోసగించి అధికారం చేజిక్కించుకున్న సిఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం దగా పడిందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని ఎపి భారాస క్యాంప్ కార్యాలయంలో గుంటూరుజిల్లాకి చెందిన మహబూబ్ బాషా ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కి చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సంధర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రచార ఆర్భాటాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తోందని దుయ్యబట్టారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని వైసిపి ప్రజాప్రతినిధుల్ని ప్రజలు తరిమికొడుతున్నారని స్పష్టం చేశారు.  సిఎం గా జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో అన్నీ రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యారని ఆరోపించారు . ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైకాపా సర్కార్ ను సాగనం పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు . తెలంగాణ మోడల్ అభివృద్ది ఎపి లో జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.

తొలుత అనంతపురానికి చెందిన ఎండి రహమతుల్లా. అలీ అహ్మద్, ఎండి ఇబ్రహీం, న్యాయవాది ఎండి ముజాఫర్ సమి ,నిరసనమెట్ల శ్రీనాథ్.మహ్మద్ హమద్ .కురుబ నాగరాజు .సమత ఖాన్.ఎండి సాజిద్ షా.ఎండి మిరాజ్. మొహమ్మద్ ఇర్ఫాన్,ఫిరోజ్ ఖాన్ షేక్ అహ్మద్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లాం ప్రకాష్ ,నరసరావు పేటకు చెందిన దేవసహాయం సహా పలు జిల్లాలకి చెందిన నాయకులు బి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

Also Read: BRO Looks: లుంగీ గెటప్ లో పవన్, సాయిధరమ్ తేజ్, వింటేజ్ లుక్స్ అదుర్స్