Andhra Student: అమెరికాలో ఆంధ్ర మెడికల్ స్టూడెంట్ మృతి

Andhra Student: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల వైద్య విద్యార్థి అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. ఫిజియోథెరపీలో ఎంఎస్ చేస్తున్న షేక్ జహీరా నాజ్ చికాగోలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ కావడంతో మరణించింది. విజయవాడ శివార్లలోని ప్రసాదంపాడు వద్ద ఆమె కుటుంబసభ్యులకు అందిన సమాచారం మేరకు గ్యాస్ లీక్ కావడంతో కారు డ్రైవర్‌తో పాటు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన […]

Published By: HashtagU Telugu Desk

Crime

Andhra Student: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల వైద్య విద్యార్థి అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. ఫిజియోథెరపీలో ఎంఎస్ చేస్తున్న షేక్ జహీరా నాజ్ చికాగోలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ కావడంతో మరణించింది. విజయవాడ శివార్లలోని ప్రసాదంపాడు వద్ద ఆమె కుటుంబసభ్యులకు అందిన సమాచారం మేరకు గ్యాస్ లీక్ కావడంతో కారు డ్రైవర్‌తో పాటు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.

విజయవాడలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేసిన జహీరా ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్‌ కోసం అమెరికా వెళ్లింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు సహకరించాలని కుటుంబీకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల విదేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చనిపోతున్నారు. ఉన్నత విద్య కోసం వెళ్తే సరైన జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. యూఎస్, జర్మనీ, కెనడ లాంటి దేశాల్లో తెలుగు విద్యార్థుల కోసం సరైన రక్షణ చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Also Read: HYD: జూబ్లీహిల్స్, హిమాయ‌త్ న‌గ‌ర్‌ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి

  Last Updated: 21 Dec 2023, 12:42 PM IST