Site icon HashtagU Telugu

Andhra PRC: ఏపీలో ఐదేళ్లకోసారి పీఆర్సీ.. రిటైర్ మెంట్ తరువాతే పీఆర్సీ బకాయిలు

Prc

Prc

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు నుంచి రావాల్సిన బకాయిలు అన్నీ ఉద్యోగుల రిటైర్ మెంట్ తరువాతే చెల్లించనున్నారు. గత సంప్రదాయాలకు భిన్నంగా 11వ పీఆర్సీలో ఈ కొత్త విధానాన్ని పొందుపరిచారు. మామూలుగా అయితే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను ఇప్పటివరకు పీఎఫ్, జీపీఎఫ్ అకౌంట్లలో వేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం రిటైర్ మెంట్ తరువాతే అని సర్కారు స్పష్టం చేసింది.

రికవరీల విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందుతుండడంతో 2019 జూలై 31 నుంచి 2020 మార్చి వరకు ఇచ్చిన ఐఆర్ రికవరీని నిలిపివేసింది. ఇక 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు అంటే మొత్తం 21 నెలలకు గాను ఇవ్వాల్సిన డీఏ బకాయిలు మాత్రం పెండింగ్ లో పెట్టింది. అంటే రిటైర్ మెంట్ తరువాతే ఇస్తామని చెప్పింది. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. గత ప్రభుత్వాల మాదిరి.. ఆ బకాయిలను పీఎఫ్ ఖాతాలో జమ చేయాలని కోరుతున్నాయి.

కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, సొసైటీల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా పదకొండో పీఆర్సీ సవరించిన పేస్కేల్స్-2022 వర్తిస్తాయని చెప్పింది.

పీఆర్సీ అమలుకు చెందిన మొత్తం 8 జీవోలను వివిధ శాఖలు విడివిడిగా ఇచ్చాయి. పెన్షనర్లకు మొత్తం నాలుగు వాయిదాల్లో బకాయిలను చెల్లిస్తారు. వీరికి పీఆర్సీ ప్రయోజనాలు 2022 జనవరి నుంచి వర్తిస్తాయి. ఉద్యోగులకు పీఆర్సీని ఐదేళ్లకోసారి అమలు చేస్తామని కూడా చెప్పింది. సెంట్రల్ పే కమిషన్ అంశాన్ని కూడా తీసేసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ కాని చనిపోతే మట్టి ఖర్చుల కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.25 వేలు చేసింది.

Cover Pic- File pic