Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న కరువు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితులలో సీఎం జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలోని 470 కరువు మండలాల్లో ప్రభుత్వం 103 మండలాలను మాత్రమే ప్రకటించింది. రాష్ట్రంలో వరి సాగు తగ్గిపోయింది. వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రులు సమీక్షలు నిర్వహించడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు గత టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని గుర్తు చేస్తూ.. రాష్ట్రంలో కరువు రహిత జిల్లా ఎక్కడా లేదన్నారు. కడప జిల్లాలో కరువు మండలాలు ప్రకటించలేదు. టీడీపీ హయాంలో కరువును సమర్థంగా ఎదుర్కొన్నాం. జగన్ మోహన్ రెడ్డి రాయలసీమను నిండా ముంచుతున్నారు. టీడీపీ హయాంలో సాగునీటి కోసం రూ.63 వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ కేవలం 23 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు. రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాల్లో సీఎం జగన్ తో పాటు మంత్రులు పర్యటించి పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యుత్‌ఘాతంతో చాలా మంది రైతులు చనిపోతున్నారు, అలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
Also Read: Leo: ఓటీటీలోకి లియో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!