Site icon HashtagU Telugu

Dowaleswaram : పెరుగుతున్న వరద…ధవళేశ్వరం వద్ద ప్రమాదస్థాయిలో గోదావరి..!!

Godavari

Godavari

గోదావరి మళ్లీ పొటెత్తుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రమాదస్థాయి అడుగులకు చేరకుంది. దీంతో ప్రస్తుతం 6లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోని విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ధవళేశ్వరానికి సుమారు పది లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గత వందఏండ్లలో రాని వరదలు జూలై మాసంలో రావడంతో గోదావరికి వరద పోటెత్తింది. జూలై మాసంలో గోదావరికి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు. రేపు మధ్యాహ్నం నాటికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. దానికి అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తీరం వెంబడి ఉన్న జిల్లాల అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో సహాయక చర్యల కోసం NDRF, SDRFకు చెందిన ఒక్కొక్క టీంను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఇక తెలంగాణలోని భద్రాచలం పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువన ఉన్న భద్రాచలం వద్ద వరద ప్రవాహం 12.58 లక్షల క్యూసెక్కులకు దాటింది.

 

Exit mobile version