Andhra Floods: వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లకపోవడానికి కారణం తెలిపిన జగన్

ఏపీలో వచ్చిన వరదలపై అధికారులు సమర్దవంతంగా చర్యలు తీసుకున్నారని, కానీ ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల కోసం ప్రభుత్భంపై బురద చల్లుతున్నారన్నారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

  • Written By:
  • Publish Date - November 26, 2021 / 11:31 PM IST

ఏపీలో వచ్చిన వరదలపై అధికారులు సమర్దవంతంగా చర్యలు తీసుకున్నారని, కానీ ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల కోసం ప్రభుత్భంపై బురద చల్లుతున్నారన్నారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

వరద సహాయక చర్యలు ఆగకూడదనే తాను వరద ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్లలేదని, అది కూడా సీనియర్‌ అధికారుల సూచనల మేరకే ఆగిపోయానని జగన్ తెలిపారు. తాను వరద ప్రాంతాలకు వెళ్లడం కన్నా బాధితులకు సహాయం అందడం ముఖ్యమని, అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను జిల్లాలోనే ఉండమన్నామని జగన్ తెలిపారు. సహాయక చర్యల తర్వాత ఖచ్చితంగా జిల్లాల్లో పర్యటిస్తానని అయన ప్రకటించారు.

50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఫించా నుంచి అన్నమయ్య ప్రాజెక్టుకు వరద నీరు వచ్చిందని, అర్ద్రరాత్రి సమయంలో కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయిందని జగన్ తెలిపారు. వరదల వల్ల ఒక బస్సు నదిలో చిక్కుకోవటం వలన ప్రాణనష్టం జరిగిందని, రెండు మూడు గంటల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని జగన్ వివరించారు. ముంపు గ్రామాల బాధితులకు తాగు నీరు, ఆహారం అందించామని చెప్పారు.

తాను ఏరియల్ సర్వే చేసానని, వరదలవల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిపై తనకి మమకారం ఉంటుందని, తాను ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండనని స్పష్టం చేసారు. ఈ సమయంలో జిల్లాల పర్యటనకు వెళ్తే అధికారులు
వరద బాధితుల సహాయ కార్యక్రమాలు వదిలేసి, ముఖ్యమంత్రి పర్యటనపైనే ఫోకస్ పెడతారనే కారణంతోనే తాను వెళ్లలేదని సీఎం తెలిపారు.

వరద సహాయక చర్యలకోసం 84 కోట్లు విడుదల చేసామని, ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ వంద శాతం పునరుద్దరించామని చెప్పారు. మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా రూ.5లక్షలు అందించామన్నారు. నష్టం వివరాలు ఎక్కడా దాచిపెట్టడం లేదు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని సీఎం వెల్లడించారు.