ఏపీలో కూటమి విజయం సాధించిన దగ్గరి నుండి తనకు అనేక బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో శ్యామల వైసీపీ కి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై దారుణమైన కామెంట్స్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. “ఒక్కటే మాట చెబుతా… రాజకీయాలు అంటే ఆవేశపడడం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు. రాజకీయాలు అంటే సాయం చేయడం అని నేను నమ్ముతా. రాజకీయాలకు నేనిచ్చే నిర్వచనం ఇదీ..ఇప్పటివరకు ఆయన ఆవేశపడడం చూశాను, ఆయాసపడడం చూశాను. పాపం… వేదికలపై ఎంత అరుస్తారండీ ఆయన! ఆయనను ఈ విధంగా చూశానే తప్ప… సాయం చేయడం ఎక్కడా చూడలేదు” అంటూ శ్యామల పేర్కొనడం ఫై అభిమానులు, జనసేన శ్రేణులు ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు కూటమి విజయం సాధించడంతో శ్యామల తాజాగా సోషల్ మీడియా లో స్పందించింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొంది. అదేవిధంగా అఖండ విజయం సాధించిన కూటమి ప్రతినిధులు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ గెలుపుకోసం అవిశ్రాంతంగా శ్రమించిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన నాడు విర్రవీగలేదని.. ఓటమి ఎదురైన నాడు కుంగిపోలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మరింత బలాన్ని పుంజుకుని అధికారంలోకి వస్తారని తెలిపారు.
అలాగే వైసీపీ ఓడిన నాటి నంచి తనకు విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శ్యామల ఆందోళన వ్యక్తం చేసింది. అందరిలానే తాను కూడా ప్రజాస్వామ్యంలో ఓ పార్టీకి మద్దతుగా నిలిచానని, ఆ విషయాన్ని అందరూ సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. తాను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదని.. దయచేసి విషాయాన్ని అర్థం చేసుకోవాలని శ్యామల కోరారు.
Read Also :